పోలీసులకు మావోయిస్టుల సవాల్
దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో కైలాసం పేరుతో మావోయిస్టులు విడుదల చేసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. ఆపరేషన్ ముస్కాన్ పేరుతో కొనసాగుతున్న దాడిని ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మౌలిక వసతులు కావాలని ప్రజలు కోరుకుంటే దాన్ని వక్రీకరిస్తున్నారని విమర్శించారు. దొంగే దొంగ అన్నట్లు, మౌలిక వసతుల అభివృద్ధికి మావోయిస్టులు అడ్డుపడుతున్నారంటూ పోలీసులు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దీనిపై బహిరంగ చర్చకు వస్తారా అని పోలీసులకు సవాల్ విసిరారు. కిరాయి గుండాలను తయారు చేసి అటవీ సమాజం […]
దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో కైలాసం పేరుతో మావోయిస్టులు విడుదల చేసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. ఆపరేషన్ ముస్కాన్ పేరుతో కొనసాగుతున్న దాడిని ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మౌలిక వసతులు కావాలని ప్రజలు కోరుకుంటే దాన్ని వక్రీకరిస్తున్నారని విమర్శించారు. దొంగే దొంగ అన్నట్లు, మౌలిక వసతుల అభివృద్ధికి మావోయిస్టులు అడ్డుపడుతున్నారంటూ పోలీసులు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దీనిపై బహిరంగ చర్చకు వస్తారా అని పోలీసులకు సవాల్ విసిరారు. కిరాయి గుండాలను తయారు చేసి అటవీ సమాజం మధ్య చిచ్చు పెడుతున్నట్లు మండిపడ్డారు. ఏఓబీ సరిహద్దుల్లో వైద్యం, నిత్యావసర సరుకులు, విద్యలాంటి అభివృద్ధి కార్యక్రమాలు పోలీసుల నిర్బంధం మధ్య కొనసాగిస్తున్నట్లు లేఖలో వెల్లడించారు.