బిగ్ బ్రేకింగ్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత..
దిశ, వెబ్‌డెస్క్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూసినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యాధి సోకి అనారోగ్యంతో ఆయన చనిపోయినట్టు బస్తర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) చనిపోయినట్టు సమాచారం అందినట్టు పోలీసులు తెలిపారు. ఈయన అలిపిరి బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుడు కాగా, మాజీ సీఎం చంద్రబాబు హత్యకు ప్లాన్ చేసిన వారిలో కీలక సూత్రధారి తెలుస్తోంది. వైఎస్ హయాంలో నాటి ప్రభుత్వంతో ఆర్కే శాంతి […]
దిశ, వెబ్‌డెస్క్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూసినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యాధి సోకి అనారోగ్యంతో ఆయన చనిపోయినట్టు బస్తర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) చనిపోయినట్టు సమాచారం అందినట్టు పోలీసులు తెలిపారు. ఈయన అలిపిరి బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుడు కాగా, మాజీ సీఎం చంద్రబాబు హత్యకు ప్లాన్ చేసిన వారిలో కీలక సూత్రధారి తెలుస్తోంది.
వైఎస్ హయాంలో నాటి ప్రభుత్వంతో ఆర్కే శాంతి చర్చలు జరిపారు. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆర్కే ప్రధాన సూత్రధారి. నాలుగు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు ఆర్కే. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఈయన కొనసాగుతున్నారు. ఆర్కేపై రూ.50 లక్షలకు పైగా రివార్డు ఉన్నట్టు అధికారులు తెలిపారు. కొంతకాలంగా సౌత్ బస్తర్ అటవీ ప్రాంతంలో ఉంటున్న ఆర్కే.. బీజాపూర్ అడవుల్లో మృతి చెందినట్టు పోలీసులు స్పష్టంచేశారు.