డ్రోన్ దాడులపై బస్తర్ ఐజీకి మావోయిస్టు పార్టీ సవాల్..

దిశ, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీ కార్యకర్తలను ఏరివేయడానికి అటవీ ప్రాంతాల్లో బస్తర్ పోలీసులు డ్రోన్‌ల ద్వారా బాంబు దాడులు చేసింది ముమ్మాటికీ నిజమని ఆ పార్టీ సబ్ జోనల్ బ్యూరో వ్యాఖ్యానించింది. మధ్యవర్తులను పంపినట్లయితే దాడులు ఎక్కడ జరిగాయో, బాంబులు సృష్టించిన విధ్వంసం ఏ స్థాయిలో ఉందో చూపిస్తామని, వాస్తవాలను తెలుసుకోడానికి బస్తర్ ఐజీ సుందర్ రాజు గ్రహించాలని పేర్కొంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భద్రతా సలహాదారు (ప్రధానమంత్రి కార్యాలయం) విజయకుమార్, […]

Update: 2021-04-22 04:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీ కార్యకర్తలను ఏరివేయడానికి అటవీ ప్రాంతాల్లో బస్తర్ పోలీసులు డ్రోన్‌ల ద్వారా బాంబు దాడులు చేసింది ముమ్మాటికీ నిజమని ఆ పార్టీ సబ్ జోనల్ బ్యూరో వ్యాఖ్యానించింది. మధ్యవర్తులను పంపినట్లయితే దాడులు ఎక్కడ జరిగాయో, బాంబులు సృష్టించిన విధ్వంసం ఏ స్థాయిలో ఉందో చూపిస్తామని, వాస్తవాలను తెలుసుకోడానికి బస్తర్ ఐజీ సుందర్ రాజు గ్రహించాలని పేర్కొంది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భద్రతా సలహాదారు (ప్రధానమంత్రి కార్యాలయం) విజయకుమార్, పీఎంఓలోని ఆపరేషన్స్ డీజీపీ అశోక్ జునేజా, ఆపరేషన్స్ డీఐజీ నళినీ ప్రభాత్‌ల సంయుక్త ఆలోచనల్లో భాగమే ఎన్ఐఏ డ్రోన్‌ల ద్వారా మావోయిస్టు పార్టీ దళాలపై బాంబులు కురిపించడమని పేర్కొంది. డ్రోన్‌ల ద్వారా తమపై బాంబులతో దాడి జరిగినట్లు చెప్తున్నా ‘అది మావోయిస్టు పార్టీ కట్టుకథ’ అంటూ బస్తర్ ఐజీ సుందరరాజు వ్యాఖ్యానిస్తున్నారని, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మావోయిస్టు పార్టీకి లేదని సబ్ జోనల్ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది.

డ్రోన్ దాడి జరిగిన ప్రాంతానికి పాత్రికేయులు, ప్రజాస్వామికవాదులు వచ్చి పరిశీలించవచ్చని ఆఫర్ ఇచ్చింది. ఈ నెల 19న పీఎల్‌జీఏ ఈ డ్రోన్‌లను గుర్తించి కూల్చివేసిందని, వాటిని కూడా తాము చూపిస్తామని స్పష్టం చేసింది. డ్రోన్ దాడులు కరెక్టు కాదు అని చెప్తున్న బస్తర్ ఐజీ సుందరరాజు తన మధ్యవర్తులను పంపితే దాడులు జరిగింది నిజమేనని ఆధారాలతో సహా నిరూపిస్తామని, అందుకు ఆయన సిద్ధం కావాలని సబ్ జోనల్ బ్యూరో సవాలు విసిరింది.

 

Tags:    

Similar News