కరోనాతో మావోయిస్టు మధుకర్ మృతి
దిశ ప్రతినిధి, వరంగల్: కరోనాతో మావోయిస్టు మధుకర్ అలియాస్ శోభ్రాయ్ మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన వారం రోజుల క్రితం వాజేడు ప్రాంతానికి చేరుకున్నారు. ఈనెల 1వ తేదీన అక్కడి నుంచి ఆయన ఓ మైనర్ సాయంతో వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి బయల్దేరాడు. అయితే అదే రోజు సాయంత్రం ములుగురోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. కారులో వెనుక వైపు కూర్చున్న మధుకర్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి […]
దిశ ప్రతినిధి, వరంగల్: కరోనాతో మావోయిస్టు మధుకర్ అలియాస్ శోభ్రాయ్ మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన వారం రోజుల క్రితం వాజేడు ప్రాంతానికి చేరుకున్నారు. ఈనెల 1వ తేదీన అక్కడి నుంచి ఆయన ఓ మైనర్ సాయంతో వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి బయల్దేరాడు. అయితే అదే రోజు సాయంత్రం ములుగురోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. కారులో వెనుక వైపు కూర్చున్న మధుకర్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో మధుకర్ మావోయిస్టు అన్న విషయం వెల్లడైంది. మధుకర్‌కు సహాయం చేసిన మైనర్ మావోయిస్టు కొరియర్‌గా గుర్తించారు.
మైనర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే మధుకర్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈనెల 3వరకు అక్కడే చికిత్స పొందిన మధుకర్ పల్స్‌రేటు బాగా పడిపోయింది. వైద్యుల సూచనల మేరకు మధుకర్‌ను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటి నుంచి చికిత్స పొందుతున్న మధుకర్ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈవిషయాన్ని హైదరాబాద్ పోలీసులు సైతం ధ్రువీకరించారు. మధుకర్ స్వస్థలం కొమురం భీం జిల్లా కావడం గమనార్హం.