బిగ్ బ్రేకింగ్ : మావోయిస్టు నేత మృతి
దిశ ప్రతినిధి, కరీంనగర్: నక్సల్బరీ రెండోతరం నాయకుడు కత్తి మోహన్ రావు ఈ నెల 10న గుండెపోటుతో మరణించినట్టు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటనతో తెలిపారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం సమీపంలోని గార్లకు చెందిన మోహన్ రావు 1982లో విప్లవ పంథా వైపు అడుగులేసి ఆర్ఎస్‌యూలో చేరారని, 39 ఏళ్ల సుదీర్ఘ కాలం ఆయన సాయుధ పోరుబాటలో నడిచారన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్ రావు దామదాదాగా పేరుతో జనతన్ […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: నక్సల్బరీ రెండోతరం నాయకుడు కత్తి మోహన్ రావు ఈ నెల 10న గుండెపోటుతో మరణించినట్టు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటనతో తెలిపారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం సమీపంలోని గార్లకు చెందిన మోహన్ రావు 1982లో విప్లవ పంథా వైపు అడుగులేసి ఆర్ఎస్‌యూలో చేరారని, 39 ఏళ్ల సుదీర్ఘ కాలం ఆయన సాయుధ పోరుబాటలో నడిచారన్నారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్ రావు దామదాదాగా పేరుతో జనతన్ సర్కార్ నిర్వహిస్తున్న పాఠశాలలో టీచర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని జగన్ వివరించారు. ఈ నెల 10న తన డేరాలోకి వెల్లి దామదాదా అనారోగ్యానికి గురికాగా పీఎల్జీఏ బలగాలు వైద్యం అందించినా ఫలితం లేకుండా పొయిందని జగన్ తెలిపారు. ఈ నెల 11న దామదాదా అంత్యక్రియలను దండకారణ్య అటవీ ప్రాంతంలో నిర్వహించినట్టు ప్రకటనలో వివరించారు. ప్రభుత్వాల నిర్భందం కారణంగా అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించలేకపోయామన్నారు. సుదీర్ఘ కాలం విప్లవంతోనే అనుభందం పెంచుకుని చివరి వరకు అదే పంథాలో కొనసాగిన మోహన్ రావు మృతి పట్ల తెలంగాణ కమిటీ నివాళులు అర్పిస్తోందని పేర్కొన్నారు.