కుంట శ్రీనివాస్ సస్పెన్షన్.. ఇంతకీ ఎవరితను?
దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేట్ దంపతుల హత్య కేసులో రెండో నిందితుడు కుంట శ్రీనివాస్‌పై టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుంట వామన్‌రావు దంపతుల మర్డర్ కేసు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పార్టీ అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మరి కొద్ది సేపట్లో కుంట శ్రీనివాస్‌ను మీడియా ముందు పోలీసులు ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేట్ దంపతుల హత్య కేసులో రెండో నిందితుడు కుంట శ్రీనివాస్‌పై టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుంట వామన్‌రావు దంపతుల మర్డర్ కేసు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పార్టీ అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మరి కొద్ది సేపట్లో కుంట శ్రీనివాస్‌ను మీడియా ముందు పోలీసులు ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, శ్రీనివాస్ గతంలో గుంజపడుగు MPTCగా పనిచేశారు. మంథని మాజీ MLA, పెద్దపల్లి ZP ఛైర్మన్ పుట్టా మధుకు ఈయన ప్రధాన అనుచరుడని సమాచారం. శ్రీనివాస్‌పై ఇప్పటికే అనేక కజ్జా, బెదిరింపులు, వరకట్న వేధింపుల కేసులున్నాయి.