ఆ రైల్వే లైన్‌ను జనవరి వరకు అందుబాటులోకి తీసుకురావాలి.. మంత్రి హరీశ్ రావు
దిశ, సిద్దిపేట: మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే పనులు వేగవంతం చేయాలని మంత్రి తన్నీరు హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఆర్‌వోబీలు, సర్వీస్ రోడ్లు, ఫ్లై ఓవర్లుకు సంబంధించి స్థల సేకరణ, చెల్లించాల్సిన పరిహారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి కార్యాలయంలో సంబంధిత తహశీల్దార్లు, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, రైల్వే అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. రైల్వే లైన్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వమే ఉచితంగా […]
దిశ, సిద్దిపేట: మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే పనులు వేగవంతం చేయాలని మంత్రి తన్నీరు హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఆర్‌వోబీలు, సర్వీస్ రోడ్లు, ఫ్లై ఓవర్లుకు సంబంధించి స్థల సేకరణ, చెల్లించాల్సిన పరిహారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి కార్యాలయంలో సంబంధిత తహశీల్దార్లు, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, రైల్వే అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. రైల్వే లైన్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వమే ఉచితంగా స్థలాన్ని రైల్వే శాఖకు అందిస్తుందన్నారు. సిద్దిపేట జిల్లాలో 1315 ఎకరాలు, మెదక్ జిల్లాలో 172 ఎకరాలు సేకరణ పూర్తయిందని అధికారులు వివరించారు. సిద్దిపేట జిల్లాలో భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రైల్వే పనులు వేగవంతం చేయాలని సూచించారు. త్వరగా పనులు పూర్తి చేసి జనవరి వరకు అందుబాటులోకి తీసుకురావాలని డివిజనల్ రైల్వే మేనేజర్‌ను మంత్రి కోరారు.