మణిరత్నం 'నవరసాలు'.. చూపించాడు ఇలా

దిశ, వెబ్‌డెస్క్: లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ఓ కొత్త ఒరవడికి నాంది పలకబోతున్నారు. తొమ్మిది మంది దర్శకులతో, తొమ్మిది కథాంశాలతో, తొమ్మిది భాగాలుగా..  స్టార్ హీరోలందరితో కలిసి ‘నవరస’ అనే  వెబ్ సిరీస్ రూపొంచే పనిని చేపట్టిన సంగతి తెలిసిందే. నవరసాలతో కూడిన ఈ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హాస్యం, శృంగారం, భయానకం, కరుణ, రౌద్రం, కోపం, ధైర్యం, అద్భుతం, బీభత్సం లాంటి నవరసాల ఆధారంగా తొమ్మిది కథలను చెప్పబోతున్నారు. ఇక ఇందులో […]

Update: 2021-07-08 06:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ఓ కొత్త ఒరవడికి నాంది పలకబోతున్నారు. తొమ్మిది మంది దర్శకులతో, తొమ్మిది కథాంశాలతో, తొమ్మిది భాగాలుగా.. స్టార్ హీరోలందరితో కలిసి ‘నవరస’ అనే వెబ్ సిరీస్ రూపొంచే పనిని చేపట్టిన సంగతి తెలిసిందే. నవరసాలతో కూడిన ఈ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హాస్యం, శృంగారం, భయానకం, కరుణ, రౌద్రం, కోపం, ధైర్యం, అద్భుతం, బీభత్సం లాంటి నవరసాల ఆధారంగా తొమ్మిది కథలను చెప్పబోతున్నారు. ఇక ఇందులో స్టార్ హీరోలు సూర్య, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, అధర్వ, బాబీ సింహా,నిత్యా మీనన్ , ఐశ్వర్య రాజేష్, విక్రాంత్ , గౌతమ్ కార్తీక్, శ్రీరామ్, అశోక్ సెల్వన్ ఇంకా గౌతమ్ వాసుదేవన్ మీనన్, అరవింద్ స్వామి లాంటి స్టార్లందరూ కనిపించనున్నారు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కోసం రూపొందిస్తున్న ఈ సిరీస్ యొక్క తొమ్మిది ఫస్ట్ లుక్ పోస్టర్లను వాటిని తెరకెక్కించిన దర్శకులను మేకర్స్ పరిచయం చేశారు.

1.’గిటార్ కంబి మేలే నిండ్రు’ అనే భాగానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించగా ఈ పార్ట్ లో సూర్య – ప్రయాగా మార్టిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఇందులో సూర్య యంగ్ లుక్ నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

2. ‘పాయసం’ అనే ఎపిసోడ్ కి వసంత దర్శకత్వం వహించారు. ఇందులో ఢిల్లీ గణేష్, రోహిణి, అదితి బాలన్, కార్తీక్ కృష్ణ కీలక పాత్రల్లో నటించారు.

3. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘సమ్మర్ ఆఫ్ 92’ అనే విభాగం తెరకెక్కింది. ఈ సిరీస్ లో కమెడియన్ యోగిబాబు, రమ్య నంబీసన్ ముఖ్య పాత్రలు పోషించారు.

4. డైరెక్టర్ బెజోయ్ నంబియార్ ‘ఎథిరి’ అనే ఎపిసోడ్ ని రూపొందించారు. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, రేవతి మరియు అశోక్ సెల్వన్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.

5.’శాంతి’ విభాగానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇందులో బాబీసింహా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మాస్టర్ తరుణ్ కీ రోల్స్ ప్లే చేశారు.

6. అరవింద్ స్వామి ‘రౌద్రమ్’ రసానికి దర్శకత్వం వహించారు. శ్రీరామ్ – రిత్విక – అభినయశ్రీ – రమేష్ తిలక్ – గీతా కైలాసం ఇందులో నటించారు.

7. ‘ప్రాజెక్ట్ అగ్ని’ అనే ఎపిసోడ్ కు కార్తీక్ నరేన్ డైరెక్షన్ చేశారు. అరవింద్ స్వామి మరియు ప్రసన్న ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు చేశారు.

8. ఆర్.రవీంద్ర ప్రసాద్ ‘ఇన్మై’ అనే విభాగాన్ని తెరకెక్కించారు. హీరో సిద్దార్థ్ – పార్వతి తిరువోర్తు ఇందులో పాత్రధారులుగా నటించారు.

10. ‘తునింత పిన్’ సిరీస్ ను హాలితా సమీన్ రూపొందించారు. అధర్వ మురళి – అంజలి మరియు కిషోర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.

తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ సిరీస్ ని అన్నిభాషలలోను డబ్ చేయనున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఆంథాలజీ సిరీస్.. ఆగస్ట్ 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Tags:    

Similar News