ఉపఎన్నికపై చర్చించకుండానే వెనుతిరిగిన మాణిక్కం ఠాగూర్
దిశ,వెబ్‌డెస్క్: గాంధీభవన్‌లో మాణిక్కం ఠాగూర్ సమీక్ష ముగిసింది. నాగార్జున సాగర్ ఉపఎన్నికపై సమీక్షించకుండానే ఆయన చెన్నైకి వెళ్లిపోయారు. కాగా ఈ సమీక్షకు జానారెడ్డి దూరంగా ఉన్నారు. జీవన్ రెడ్డి కమిటీ సిఫార్సుల మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థులను హైకమాండ్ ఫైనల్ చేస్తుందని నేతలకు ఠాగూర్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 6.7తేదీల్లో వరంగల్, ఖమ్మంలో మాణిక్యం ఠాగూర్ పర్యటించనున్నారు. ఫిబ్రవరిలోపు వరంగల్,ఖమ్మం కార్పొరేషన్‌ల పరిధిలోని అన్ని డివిజన్ల కమిటీలు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.