తెలంగాణలో మామిడి పండ్లు డోర్ డెలివరీ
మామిడి ప్రియుల కోసం తెలంగాణ ఉద్యానవన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా పండ్ల మార్కెట్ల మూతపడ్డాయి. ఈనేపథ్యంలో మామిడి అమ్మకాలు గణనీయంగా తాగ్గాయి. దీంతో వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మామిడి పండ్లను డోర్ డెలివరీ చేయాలని తెలంగాణ ఉద్యావన శాఖ నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం పాటిస్తూ సేకరించిన మామిడి కాయలను, సహజ పద్ధతిలో మాగబెట్టి, 5 కిలోల చొప్పున కార్టన్ బాక్స్‌లలో ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేయనుంది. ఇందు కోసం తపాలా […]
మామిడి ప్రియుల కోసం తెలంగాణ ఉద్యానవన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా పండ్ల మార్కెట్ల మూతపడ్డాయి. ఈనేపథ్యంలో మామిడి అమ్మకాలు గణనీయంగా తాగ్గాయి. దీంతో వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మామిడి పండ్లను డోర్ డెలివరీ చేయాలని తెలంగాణ ఉద్యావన శాఖ నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం పాటిస్తూ సేకరించిన మామిడి కాయలను, సహజ పద్ధతిలో మాగబెట్టి, 5 కిలోల చొప్పున కార్టన్ బాక్స్‌లలో ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేయనుంది. ఇందు కోసం తపాలా పార్శిల్ సర్వీస్ సేవలను వినియోగించుకోనుంది. 5 కిలోల బాక్స్‌లో సుమారు 12 నుంచి 15 పండ్లు ఉంటాయని, డెలివరీ చార్జీలతో కలిపి రూ.350 చెల్లించాలని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు 7997724925, 7997724944 నంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వొచ్చని అధికారులు తెలిపారు. మే 1 తేదీ నుంచి బుక్సింగ్ ప్రారంభిస్తామని, ఆర్డర్ ఇచ్చిన 5 రోజుల్లో డెలివరీ చేస్తామని అధికారులు తెలిపారు.
Tags: mangoes, door delivery, ts horticulture, postal