కోహెడ మార్కెట్‌కు రిపేర్లు.. గడ్డిఅన్నారంలోనే విక్రయాలు
దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం రాష్ట్రంలోనే అతి పెద్దదైన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా రంగారెడ్డి జిల్లా కోహెడకు తరలించిన విషయం విధితమే. సోమవారం కోహెడ పరిసర ప్రాంతాల్లో గాలివాన బీభత్సానికి తాత్కాలిక షెడ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఈ క్రమంలో రైతులకు ఇబ్బందులు లేకుండా మూడు రోజులపాటు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను తెరిచి మామిడి క్రయ విక్రయాలు ప్రారంభించారు. మంగళవారం గడ్డి అన్నారం మార్కెట్‌కు 1500 టన్నుల మామిడికాయలు వచ్చినట్టు […]
దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం రాష్ట్రంలోనే అతి పెద్దదైన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా రంగారెడ్డి జిల్లా కోహెడకు తరలించిన విషయం విధితమే. సోమవారం కోహెడ పరిసర ప్రాంతాల్లో గాలివాన బీభత్సానికి తాత్కాలిక షెడ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఈ క్రమంలో రైతులకు ఇబ్బందులు లేకుండా మూడు రోజులపాటు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను తెరిచి మామిడి క్రయ విక్రయాలు ప్రారంభించారు. మంగళవారం గడ్డి అన్నారం మార్కెట్‌కు 1500 టన్నుల మామిడికాయలు వచ్చినట్టు ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి వెంకటేశం తెలిపారు. దెబ్బతిన్న కోహెడ తాత్కాలిక మార్కెట్ పునరుద్దరణకు కసరత్తు చేస్తున్నట్టు ఆయన వివరించారు.
Tags: mango sales, gaddiannaram market, full rain, koheda damage