మామిడి రైతులకు రవాణా సౌకర్యం కల్పించాలి

దిశ, న్యూస్‌‌బ్యూరో: మామిడి రైతులకు ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించి, పంట అమ్ముకునేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలని కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం కొహెడ ప్రూట్‌ మార్కెట్‌ను పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గడ్డి అన్నారం మార్కెట్‌ను ప్రభుత్వం అకస్మాత్తుగా మార్చడంతో రైతులకు సరైన సౌకర్యాలు లేక తాత్కాలిక షెడ్లలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. మార్కెట్‌లో కనీసం లైట్లు కూడా లేకపోవడంతో రాత్రి సమయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. […]

Update: 2020-04-28 10:00 GMT

దిశ, న్యూస్‌‌బ్యూరో: మామిడి రైతులకు ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించి, పంట అమ్ముకునేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలని కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం కొహెడ ప్రూట్‌ మార్కెట్‌ను పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గడ్డి అన్నారం మార్కెట్‌ను ప్రభుత్వం అకస్మాత్తుగా మార్చడంతో రైతులకు సరైన సౌకర్యాలు లేక తాత్కాలిక షెడ్లలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. మార్కెట్‌లో కనీసం లైట్లు కూడా లేకపోవడంతో రాత్రి సమయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్ వెంటనే ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని మార్కెట్ వ్యవస్థను మెరుగు పర్చేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.

Tags: Mango Farmers, market, transport, congress, Sasidhar Reddy, Kodanda Reddy, Koheda

Tags:    

Similar News

టైగర్స్ @ 42..