ఉద్యమం నుంచి కేసీఆర్ వెంటే.. అందుకే మళ్లీ పదవి
దిశ, తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌గా తిరిగి మళ్లీ మందుల సామేల్ నియామకం అయ్యారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మందుల సామేల్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌గా నియమిస్తూ, బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన కాలం నుంచి సీఎం కేసీఆర్‌కు దగ్గరగా ఉంటూ, సామేల్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆయనది తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ సందర్భంగా […]
దిశ, తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌గా తిరిగి మళ్లీ మందుల సామేల్ నియామకం అయ్యారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మందుల సామేల్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌గా నియమిస్తూ, బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన కాలం నుంచి సీఎం కేసీఆర్‌కు దగ్గరగా ఉంటూ, సామేల్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆయనది తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిలబెట్టినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే తనకు ఈ పదవి వచ్చిందని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. తిరిగి మళ్లీ నన్ను ఒక సంవత్సర కాలం పాటు ఈ సంస్థకు చైర్మెన్‌గా నియమించిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లకు ధన్యావాదములు తెలిపారు.