కత్తి మహేశ్ మృతి ప్రమాదం కాదట.. వారే ఇలా చేశారా..?
దిశ, వెబ్‌డెస్క్: సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురై, చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని యర్రావారిపాలెం మండలం యలమంద గ్రామంలో కత్తి మహేశ్ అంత్యక్రియలు సోమవారం జరిగాయి. బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కత్తిమహేశ్ కు కడసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలోనే కత్తి మహేశ్ మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మార్పీఎస్ […]
దిశ, వెబ్‌డెస్క్: సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురై, చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని యర్రావారిపాలెం మండలం యలమంద గ్రామంలో కత్తి మహేశ్ అంత్యక్రియలు సోమవారం జరిగాయి. బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కత్తిమహేశ్ కు కడసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలోనే కత్తి మహేశ్ మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ ఆరోపించారు.
ప్రమాదం జరిగినప్పుడు మహేశ్ తో పాటు కారులో మరో వ్యక్తి కూడా ఉన్నాడని, కారులో ముందు సీట్లో కూర్చున్న కత్తి మహేశ్ ప్రమాదానికి గురై చనిపోతే.. అదే కారులో పక్కనే కూర్చున్న వ్యక్తికి చిన్న గాయం కూడా తగలకపోవడమేంటని ప్రశ్నించారు. ఇక కత్తి మహేశ్ కూర్చున్న వైపే కారు డ్యామేజ్ కావడం అనుమానాలకు తావిస్తోందన్న మంద కృష్ణ ప్రమాదం జరిగి హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు వైద్యులు అతనికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారన్నారు. ఇది కేవలం ప్రమాదంలా అనిపించడంలేదని, కత్తి మహేశ్ కి చాలామంది శత్రువులు ఉన్నారని తెలిపారు. ఈ అనుమానాలు నివృత్తి చేయడానికి 15 రోజుల కాలంలో జరిగిన వైద్య పరీక్షలపై పూర్తి నివేదిక అందించాలని డిమాండ్ చేశారు.