పీవీని ఆదర్శంగా తీసుకోవాలి: మందకృష్ణ

దిశ, న్యూస్ బ్యూరో: మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు తీసుకువచ్చిన భూసంస్కరణ చట్టాన్ని మరింత పకడ్బందిగా అమలు చేయాలని ఎమ్ఆర్‌పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన ఆదివారం ఓ ప్రకటన చేశారు. కులతత్వ, దొరతత్వం లేని పీవీని నేటి పాలకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి వందల ఎకరాలను పేదలకు పంచిన సౌమ్యవాది పీవీ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు […]

Update: 2020-06-28 11:13 GMT

దిశ, న్యూస్ బ్యూరో: మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు తీసుకువచ్చిన భూసంస్కరణ చట్టాన్ని మరింత పకడ్బందిగా అమలు చేయాలని ఎమ్ఆర్‌పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన ఆదివారం ఓ ప్రకటన చేశారు. కులతత్వ, దొరతత్వం లేని పీవీని నేటి పాలకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి వందల ఎకరాలను పేదలకు పంచిన సౌమ్యవాది పీవీ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక స్థితి మెరుగయ్యే విధంగా సంస్కరణలతో కూడా సౌమ్యవాద విధానాన్ని మరింత జోడించినప్పుడే అభివృద్ధి, ఆర్థిక అసమానతలు లేని భారత్‌ను నిర్మించవచ్చని తెలిపారు. పాలకులు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. అప్పుడే పీవీ నరసింహారావుకు నిజమైన నివాళులర్పించిన వాళ్లమవుతామని చెప్పారు.

Tags:    

Similar News