కాసేపట్లో మనుమరాలి పెళ్లి.. ఇంతలో తాతకు రోడ్డప్రమాదం
దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గరిడేపల్లికి చెందిన పెండెం వెంకటయ్య(50) కాలినడకన రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. అదే సమయంలో అప్పన్నపేట సమీపంలోని బీకేం ఇన్ఫ్రా ప్రాజెక్టుకు చెందిన లారీ గరిడేపల్లి వైపు వస్తోంది. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న వెంకటయ్యను లారీ బలంగా […]
దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గరిడేపల్లికి చెందిన పెండెం వెంకటయ్య(50) కాలినడకన రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. అదే సమయంలో అప్పన్నపేట సమీపంలోని బీకేం ఇన్ఫ్రా ప్రాజెక్టుకు చెందిన లారీ గరిడేపల్లి వైపు వస్తోంది. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న వెంకటయ్యను లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ప్రమాదానికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హుజూర్‌నగర్-మిర్యాలగూడ రహదారిపై మృతదేహంతో ధర్నా చేపట్టారు. గరిడేపల్లి మండలంలో కంకరమిల్లు మూలంగా లారీలు ఇష్టానుసారంగా తిరిగి, అనేక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆరోపించారు. సమాచారం అందుకున్న హుజూర్‌నగర్ సీఐ రామలింగారెడ్డి అక్కడి చేరుకొని ధర్నా చేస్తోన్న బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా, వారు వినకపోవడంతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ధర్నా విరమించారు. మృతుని రెండో కూతురు రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు ట్రైనీ ఎస్ఐ సతీష్ వర్మ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మనమరాలి పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పెండెం వెంకటయ్యకు గురువమ్మ, రజిత, ప్రియాంక అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురైన గురవమ్మకు గరిడేపల్లికి చెందిన వ్యక్తితో గతంలో వివాహం జరిగింది. దీంతో గురవమ్మకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురికి ఇటీవల మిర్యాలగూడ మండలం రాయినిపాలెం గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. దీంతో ఆదివారం పెళ్లికావడంతో బంధువులను వివాహానికి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి భార్య గతేడాది మృతి చెందింది. మనవరాలు వివాహం రోజే తాత మృతిచెందడంతో గరిడేపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మండల కేంద్రంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చూస్తామని నేరేడుచర్ల, హుజూర్‌నగర్ ఎస్ఐలు విజయ ప్రకాష్, వెంకట రెడ్డి, ట్రైనీ ఎస్ఐ సతీష్ వర్మ బందోబస్తు నిర్వహించారు.