చెత్త ఆటోలో ఆస్పత్రికి తరలించారు

దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఎంతలా అంటే ఏమాత్రం అనారోగ్యం కలిగినా.. కరోనానేమో అన్న ఆందోళనతో అతనికి కిలోమీటర్ దూరం పరుగెత్తేలా. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ.భీమవరంలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అయినవారెవరూ లేని ఒక వ్యక్తి రెండు రోజులుగా ఐ.భీమవరం బస్టాప్‌లో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే కరోనా భయంతో అతని వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయడంలేదు. అయితే అతని దీనస్థితిని చూళ్లేక కొంతమంది […]

Update: 2020-07-27 05:41 GMT

దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఎంతలా అంటే ఏమాత్రం అనారోగ్యం కలిగినా.. కరోనానేమో అన్న ఆందోళనతో అతనికి కిలోమీటర్ దూరం పరుగెత్తేలా. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ.భీమవరంలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

అయినవారెవరూ లేని ఒక వ్యక్తి రెండు రోజులుగా ఐ.భీమవరం బస్టాప్‌లో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే కరోనా భయంతో అతని వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయడంలేదు. అయితే అతని దీనస్థితిని చూళ్లేక కొంతమంది స్థానికులు 108కి ఫోన్ చేశారు. ఎన్నోసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అతనిని చెత్త ఆటోలో ఆకివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు పంపించారు. దీనిపైనే ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News