ఆ మెసేజెస్ తో బంధువులను వేధిస్తోన్న బ్రహ్మచారి 

దిశ, వెబ్ డెస్క్: వయసు ముదిరినా పెళ్లి కాలేదు ఓ వ్యక్తికి. వయసులో జరగాల్సిన అచ్చటాముచ్చట తీరలేదు. కొన్ని వ్యక్తిగత కారణాల వలన 40 ఏళ్ళైనా పెళ్లి తంతు జరగలేదు. దీంతో మనస్థాపం చెందిన ఆ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా అకృత్యాలకు పాల్పడ్డాడు. బంధువులను, తెలిసినవారినే టార్గెట్ గా చేసుకుని వేధించసాగాడు. అజ్ఞాత వ్యక్తిగా ఇబ్బందికర భాషజాలంతో అసభ్యమైన మెసేజ్ లు పెడుతూ వేధింపులకు గురి చేసాడు. ఇతగాడి వికృత చేష్టలకు విసిగిపోయిన ఒక బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను  ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా నిందితుడు హైదరాబాద్ విద్యానగర్ కు చెందిన వ్యక్తి […]

Update: 2020-08-05 12:07 GMT

దిశ, వెబ్ డెస్క్: వయసు ముదిరినా పెళ్లి కాలేదు ఓ వ్యక్తికి. వయసులో జరగాల్సిన అచ్చటాముచ్చట తీరలేదు. కొన్ని వ్యక్తిగత కారణాల వలన 40 ఏళ్ళైనా పెళ్లి తంతు జరగలేదు. దీంతో మనస్థాపం చెందిన ఆ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా అకృత్యాలకు పాల్పడ్డాడు. బంధువులను, తెలిసినవారినే టార్గెట్ గా చేసుకుని వేధించసాగాడు. అజ్ఞాత వ్యక్తిగా ఇబ్బందికర భాషజాలంతో అసభ్యమైన మెసేజ్ లు పెడుతూ వేధింపులకు గురి చేసాడు.

ఇతగాడి వికృత చేష్టలకు విసిగిపోయిన ఒక బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా నిందితుడు హైదరాబాద్ విద్యానగర్ కు చెందిన వ్యక్తి అని గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

Tags:    

Similar News