చెన్నైలో దారుణం.. నడిరోడ్డు మీద యువతిపై కత్తితో దాడి

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళలపై దాడులు ఆగడంలేదు. తాజాగా.. తమిళనాడులో కాలేజీ యువతిని ఓ కిరాతకుడు నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నైలో ఉన్న మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని హత్యకు గురైంది. గురువారం మధ్నాహ్నం సమయంలో తంబరం రైల్వే స్టేషన్ సమీపంలో ఆ యువతిని దుండగుడు కత్తితో పొడిచాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలిసిన […]

Update: 2021-09-24 01:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళలపై దాడులు ఆగడంలేదు. తాజాగా.. తమిళనాడులో కాలేజీ యువతిని ఓ కిరాతకుడు నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నైలో ఉన్న మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని హత్యకు గురైంది. గురువారం మధ్నాహ్నం సమయంలో తంబరం రైల్వే స్టేషన్ సమీపంలో ఆ యువతిని దుండగుడు కత్తితో పొడిచాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News