ఇంట్రెస్టింగ్ బాయ్.. మెడ ఓ పర్మినెంట్ యాడ్‌బోర్డ్‌

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత టెక్ యుగంలో చాలామంది కష్టపడి పనిచేయకుండా జస్ట్ స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. కానీ రష్యాలోని వ్లాడివోస్టాక్‌కు చెందిన ఒనోప్కో మాత్రం స్మార్ట్ వర్క్‌కు మించిన ఆలోచనతో డబ్బులు సంపాదిస్తున్నాడు. మనం యాడ్స్ ప్రకటనల కోసం హోర్డింగ్స్, బస్‌స్టాప్స్, వెహికల్స్ వంటి వాటిని ఉపయోగించుకుంటాం. ఇతను తన ‘మెడ’నే యాడ్ అడ్రస్‌గా మార్చేసి, ఎంతోమంది వ్యాపారుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే పది అడ్వర్టైజింగ్ ప్రకటనలతో 1మిలియన్ రూబిల్స్ (13,500 డాలర్లు) సంపాదించాడు. View […]

Update: 2021-05-11 08:19 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత టెక్ యుగంలో చాలామంది కష్టపడి పనిచేయకుండా జస్ట్ స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. కానీ రష్యాలోని వ్లాడివోస్టాక్‌కు చెందిన ఒనోప్కో మాత్రం స్మార్ట్ వర్క్‌కు మించిన ఆలోచనతో డబ్బులు సంపాదిస్తున్నాడు. మనం యాడ్స్ ప్రకటనల కోసం హోర్డింగ్స్, బస్‌స్టాప్స్, వెహికల్స్ వంటి వాటిని ఉపయోగించుకుంటాం. ఇతను తన ‘మెడ’నే యాడ్ అడ్రస్‌గా మార్చేసి, ఎంతోమంది వ్యాపారుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే పది అడ్వర్టైజింగ్ ప్రకటనలతో 1మిలియన్ రూబిల్స్ (13,500 డాలర్లు) సంపాదించాడు.

ఒనోప్కో సోషల్ మీడియాలో “ఒనోకొండ” పేరుతో పాపులర్. తన ఇన్‌స్టా‌ పేజీలో తొలిసారి తన ఆలోచనను పంచుకున్నప్పుడు అంతా అతడ్ని పిచ్చోడిలా చూశారు. కానీ ఇటీవలే ఆ యంగ్ బాయ్ తన ఐడియా సూపర్ సక్సెస్ అంటూ తన ఫాలోవర్స్ అందిరకీ విజువల్ ప్రూఫ్‌ చూపించాడు.

‘నన్ను నేను వాకింగ్ బిల్‌బోర్డ్‌గా మార్చుకోవడానికి డిజిటల్ సృష్టికర్త జాన్ స్టాష్‌కెవిచ్ స్ఫూర్తిగా నిలిచాడు. నా యాడ్ పోస్ట్ ఆలోచనకు రష్యాతో పాటు, పొరుగు దేశాలలోని వ్యాపారులు, ఇతర వ్యక్తుల నుంచి చాలా ప్రశంసలు దక్కాయి. రష్యా, ఉక్రెయిన్, బెలారస్‌లోని వ్యాపారుల నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్లు నన్ను ప్రకటనల కోసం సంప్రదించారు. ఒక వేళ నా మెడపై లైఫ్‌లాంగ్ యాడ్ రూపొందించాలనుకుంటే, ఆసక్తిగల పార్టీలు 100,000 రూబిల్స్ ($ 1,350 డాలర్లు) చెల్లించాలి. దీనికి నేను అంగీకరిస్తూ, నా క్లయింట్లతో ఒక ఒప్పందంపై సంతకం చేస్తాను. నా మెడపై ఉన్న యాడ్ టాటూ జీవితాంతం కనిపించేలా ఉండటంతో పాటు, వాటిని చెరిపివేయడం లేదా ఇతర పచ్చబొట్లు కప్పకుండా నిషేధం ఉంటుందంటున్నాడు.
– ఒనోప్కో

 

Tags:    

Similar News