‘నా భర్త ఏమయ్యాడో చెప్పండి’
దిశ ఏపీ బ్యూరో: కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తి అదృశ్యమయ్యాడంటూ గుంటూరు జీజీహెచ్‌లో మహిళ ఆక్రందన ఆకాశాన్నంటుతోంది. తిరగని వార్డు లేదు, అడగని మనిషి లేడు అన్న చందాన ఆమె తన భర్త ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నెల 14వ తేదీన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ కావడంతో సదరు వ్యక్తి అడ్మిట్ అయ్యాడు. సరైన వైద్య సదుపాయాలు లేవంటూ ఆయనను తెనాలి ఆసుపత్రి నుంచి 16వ తేదీ రాత్రి గుంటూరు […]
దిశ ఏపీ బ్యూరో: కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తి అదృశ్యమయ్యాడంటూ గుంటూరు జీజీహెచ్‌లో మహిళ ఆక్రందన ఆకాశాన్నంటుతోంది. తిరగని వార్డు లేదు, అడగని మనిషి లేడు అన్న చందాన ఆమె తన భర్త ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఈ నెల 14వ తేదీన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ కావడంతో సదరు వ్యక్తి అడ్మిట్ అయ్యాడు. సరైన వైద్య సదుపాయాలు లేవంటూ ఆయనను తెనాలి ఆసుపత్రి నుంచి 16వ తేదీ రాత్రి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆ తరువాత అతని ఆచూకీలేకుండా పోయింది. అప్పటి నుంచి అతని భార్య వెంకాయమ్మ అతని ఆచూకీ కోసం రెండు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది. తన భర్త ఏమయ్యాడో చెప్పాలంటూ కన్నీటి పర్యంతమవుతోంది. 12 రోజులుగా ఆమె జీజీహెచ్ అధికారుల కాళ్లావేళ్లా పడుతోంది.