వధువు కోసం ‘బ్రా’ సైజ్ మెన్షన్ చేసిన వరుడు
దిశ, ఫీచర్స్ : మ్యాట్రిమోనియల్ యాడ్స్‌లో లైఫ్ పార్ట్‌నర్ సెలెక్షన్‌కు సంబంధించి రిక్వైర్‌మెంట్స్ జాబితా చూస్తే ఒక్కోసారి నవ్వొస్తుంది. కొందరు తమకు కాబోయే భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలో.. క్లియర్ కట్‌గా చెప్పేస్తే.. మరికొందరి గొంతెమ్మ కోరికలు మాత్రం వెగటు పుట్టిస్తాయి. ఇటీవల రెడిట్‌లో పోస్ట్ అయిన మాట్రిమోనియల్ యాడ్ కూడా అలాంటిదే కాగా.. వధువు బాడీ కొలతలకు సంబంధించి వరుడు పెట్టిన కండిషన్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తనకు కాబోయే వధువు ఎంత వయసు ఉండాలో […]
దిశ, ఫీచర్స్ : మ్యాట్రిమోనియల్ యాడ్స్‌లో లైఫ్ పార్ట్‌నర్ సెలెక్షన్‌కు సంబంధించి రిక్వైర్‌మెంట్స్ జాబితా చూస్తే ఒక్కోసారి నవ్వొస్తుంది. కొందరు తమకు కాబోయే భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలో.. క్లియర్ కట్‌గా చెప్పేస్తే.. మరికొందరి గొంతెమ్మ కోరికలు మాత్రం వెగటు పుట్టిస్తాయి. ఇటీవల రెడిట్‌లో పోస్ట్ అయిన మాట్రిమోనియల్ యాడ్ కూడా అలాంటిదే కాగా.. వధువు బాడీ కొలతలకు సంబంధించి వరుడు పెట్టిన కండిషన్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
తనకు కాబోయే వధువు ఎంత వయసు ఉండాలో ప్రకటనలో పేర్కొన్న పురుషుడు.. ఆమె బ్రా సైజు, నడుము కొలతలతో పాటు పాదాల పరిమాణాన్నీ పర్టిక్యులర్‌గా మెన్షన్ చేశాడు. ఇక పక్కనే బరువు, ఎత్తును కూడా సూచిస్తూ ‘ఆహ్లాదకరమైన/అణకువ కలిగిన స్వభావంతో పాటు అందం, పరిశుభ్రత’ తప్పనిసరి అని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇంకా తన కోరికల చిట్టాను కొనసాగించిన సదరు మిస్టర్ పర్‌ఫెక్ట్.. ‘నమ్మకం, నిజాయితీకి మారుపేరుగా ఉంటూనే సినిమాలు, షికార్లతో పాటు కుటుంబ విషయాల్లో చురుగ్గా పాల్గొనాలని తెలిపాడు. అంతేకాదు కుక్కలను ప్రేమించే, పిల్లలు లేని 18-26 సంవత్సరాల వయస్సు గలవారై ఉండాలి’ అని ముగించాడు.
బెటర్‌హాఫ్ మ్యాట్రిమోనీ యాప్‌లో పోస్ట్ చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వరుడి విచిత్ర కోరికలపై స్పందిస్తున్న నెటిజన్లు.. తమ ఆగ్రహాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. తను ఏమైనా లేడీస్ టైలరా? లేదా ‘శారీ విత్ బ్లౌజ్ పీస్’ కోసం చూస్తున్నాడా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే అతని అవసరాలు ఎంత పక్కాగా ఉన్నాయో ఎవరైనా అంగీకరించాల్సిందే అని మరొకరు యూజర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ప్రకటన మ్యాట్రిమోనీ యాప్ దృష్టిని ఆకర్షించడంతో.. యాప్ నిబంధనలు ఉల్లంఘించినందున సదరు యూజర్‌పై చర్య తీసుకున్నామని కంపెనీ వెల్లడించింది.