యాక్టర్ రజత్ బేడీ వల్ల వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే ?
దిశ, సినిమా : యాక్టర్ రజత్ బేడీ కారు ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించగా.. డీఎన్ నగర్ పోలీసులు సెక్షన్ 304A కింద కేసు నమోదు చేశారు. బాధితుడు రాజేష్ బుధ్ లేబర్ కాగా.. రోడ్డు మీదకు సడెన్‌గా రావడంతో కారు ఢీకొట్టినట్లు చెప్తున్నారు. వెంటనే రజత్ తనను ఆస్పత్రికి తరలించి, పోలీస్ స్టేషన్‌లో ఇన్‌ఫార్మ్ చేశాడని.. బాధితుడు రెండు రోజుల తర్వాత చనిపోయాడని తెలిపారు పోలీసులు. […]
దిశ, సినిమా : యాక్టర్ రజత్ బేడీ కారు ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించగా.. డీఎన్ నగర్ పోలీసులు సెక్షన్ 304A కింద కేసు నమోదు చేశారు. బాధితుడు రాజేష్ బుధ్ లేబర్ కాగా.. రోడ్డు మీదకు సడెన్‌గా రావడంతో కారు ఢీకొట్టినట్లు చెప్తున్నారు. వెంటనే రజత్ తనను ఆస్పత్రికి తరలించి, పోలీస్ స్టేషన్‌లో ఇన్‌ఫార్మ్ చేశాడని.. బాధితుడు రెండు రోజుల తర్వాత చనిపోయాడని తెలిపారు పోలీసులు. కాగా ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 279(రాష్ డ్రైవింగ్), 338 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో రజత్‌ను అరెస్ట్ చేసే చాన్స్ ఉందని చెప్తున్నారు.