ఆ ప్రేమికుడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా
దిశ, వెబ్‌డెస్క్ : నవతరం ‘ప్రేమ’కు అర్థాలు మారిపోతున్నాయి. వెంటపడటం, వేధించడం, తమ ప్రేమను కాదంటే.. ఏదో చేసెయ్యడం ఇప్పటి కుర్రకారులో ఫ్యాషన్ అయిపోయింది. అదే ప్రేమనుకుని.. భ్రమలో బతుకుతున్నారు. ‘ఇచ్చిపుచ్చుకోవడం ప్రేమ.. అర్థం చేసుకోవడం ప్రేమ.. కష్టాల్లో అండగా ఉండటం ప్రేమ.. ఏ దేశంలోనైనా, భాషలు మతాలు వేరైనా.. ప్రేమకు అర్థం ఒకటే. ఒకరికోసం ఒకరున్నామనే ధీమాను అందించడం. నిత్యం నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. ఇక్కడ ఓ ప్రేమికుడు అదే చేశాడు. తన ప్రేయసి బాధను అర్థం […]
దిశ, వెబ్‌డెస్క్ : నవతరం ‘ప్రేమ’కు అర్థాలు మారిపోతున్నాయి. వెంటపడటం, వేధించడం, తమ ప్రేమను కాదంటే.. ఏదో చేసెయ్యడం ఇప్పటి కుర్రకారులో ఫ్యాషన్ అయిపోయింది. అదే ప్రేమనుకుని.. భ్రమలో బతుకుతున్నారు. ‘ఇచ్చిపుచ్చుకోవడం ప్రేమ.. అర్థం చేసుకోవడం ప్రేమ.. కష్టాల్లో అండగా ఉండటం ప్రేమ.. ఏ దేశంలోనైనా, భాషలు మతాలు వేరైనా.. ప్రేమకు అర్థం ఒకటే. ఒకరికోసం ఒకరున్నామనే ధీమాను అందించడం. నిత్యం నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. ఇక్కడ ఓ ప్రేమికుడు అదే చేశాడు. తన ప్రేయసి బాధను అర్థం చేసుకుని.. ఆమెను సంతోషపరిచేందుకు చేసిన పని నెటిజన్లను భావోద్వేగానికి గురిచేసింది. ప్రేమంటే ఇదే కదా అని అందరూ అనేలా చేస్తోంది.
బాస్కెట్ బాల్ ఆటగాడు రెక్స్ చాప్‌మాన్.. ఓ ప్రేయసి, ప్రియుడి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది చూసిన నెటిజన్లు ఎంతో భావోద్వేగానికి గురవుతూ.. నిజమైన ప్రేమికులు అంటూ వాళ్లిద్దరినీ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆ ప్రియురాలి కోసం ఆ ప్రియుడు ఏం చేశాడంటే.. ‘ఓ యువతి పేనుకొరుకుడు(alopacia) వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిజానికి ఇది పేను వచ్చి కొరకటం కాదు గానీ, వాడుక భాషలో అలా అందరికీ అర్థమయ్యే విధంగా అలా అంటుంటారు. వైద్య పరిభాషలో దీనిని ‘అలోపేషియం ఏరిమేటా’ అని పిలుస్తారు. ఈ వ్యాధి సోకితే జుట్టు అధిక మోతాదులో రాలిపోతుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఓ యువతికి కూడా అలాంటే సమస్యే ఎదురైంది. చికిత్స తీసుకున్నా ఇంకా నయం కాలేదు. ఆమె బాధను చూడలేని ప్రియుడు ఆమెకు గుండు చేయించాడు. అంతేకాదు ఆమె బాధను పంచుకోవడానికి.. తను కూడా గుండు చేసుకున్నాడు. దీంతో ఆ యువతి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది’
https://twitter.com/RexChapman/status/1288606133414965249