వీరపనేని రామదాసు కన్నుమూత

దిశ, ములుగు: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బానిస విముక్తి ఉద్యమంలో పాల్గొన్న కమ్యూనిస్టు నేత స్వాతంత్ర సమరయోధుడు వీరపనేని రామదాసు (103) శుక్రవారం కన్నుమూశారు. ఆయన స్వగ్రామం ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. నిజాం సంస్థానానికి వ్యతిరేకంగా పోరాడిన రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, పీవీ నరసింహారావు, ఓంకార్ వంటి సాయుధ పోరాట యోధులు కమ్యూనిస్టు నేతల పిలుపు నందుకొని తన 14వ ఏటనే వీరపనేని రామదాసు […]

Update: 2020-07-24 03:55 GMT

దిశ, ములుగు: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బానిస విముక్తి ఉద్యమంలో పాల్గొన్న కమ్యూనిస్టు నేత స్వాతంత్ర సమరయోధుడు వీరపనేని రామదాసు (103) శుక్రవారం కన్నుమూశారు. ఆయన స్వగ్రామం ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. నిజాం సంస్థానానికి వ్యతిరేకంగా పోరాడిన రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, పీవీ నరసింహారావు, ఓంకార్ వంటి సాయుధ పోరాట యోధులు కమ్యూనిస్టు నేతల పిలుపు నందుకొని తన 14వ ఏటనే వీరపనేని రామదాసు తెలంగాణ సాయుధ పోరాటంలోనూ బానిస విముక్తి కోసం జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. కమ్యూనిస్టు నేతగా స్వాతంత్ర పోరాట ఉద్యమంలోనూ పనిచేశారు. మృతుడికి భార్య ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

Tags:    

Similar News