కూర లేదని చేపలకోసం వెళ్లిన వ్యక్తి.. అంతలోనే

దిశ, మంగపేట : చెరువుకు వెళ్లి చేపలు తెచ్చుకుని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేద్దామని చెప్పిన వ్యక్తి కొద్దిసేపటికే ప్రమాదవశాత్తు చెరువులో మునిగి శవమై తేలాడు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం కొత్త మల్లూరు గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. కొత్తమల్లూరుకు చెందిన బట్ట నర్సింహులు (55) కులము బెస్త ప్రతిరోజు కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోశించేవాడు. సోమవారం సాయంత్రం కూలీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన నర్సింహులు ఇంట్లో కూర […]

Update: 2021-08-17 01:25 GMT

దిశ, మంగపేట : చెరువుకు వెళ్లి చేపలు తెచ్చుకుని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేద్దామని చెప్పిన వ్యక్తి కొద్దిసేపటికే ప్రమాదవశాత్తు చెరువులో మునిగి శవమై తేలాడు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం కొత్త మల్లూరు గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. కొత్తమల్లూరుకు చెందిన బట్ట నర్సింహులు (55) కులము బెస్త ప్రతిరోజు కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోశించేవాడు. సోమవారం సాయంత్రం కూలీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన నర్సింహులు ఇంట్లో కూర కోసమని చేపలు పట్టడానికి 6 గంటలకు గ్రామ సమీపంలోని చింతకుంట చెరువుకు వెళ్లాడు.

చెరువులో దిగి వల విసురుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు చెరువు‌లోని మిషన్ కాకతీయ పనుల గోతిలో పడి మృతి చెందాడు. గమనించిన గ్రామస్తులు నర్సింహులను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితంలేకపోయింది. విషయాన్ని పోలీసులకు తెలపడంతో మంగళవారం ఉదయం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని గ్రామస్తుల సహాయంతో బయటకు తీశారు. అనంతరం శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. మృతుడు నర్సింహులుకు భార్య చెంచులక్ష్మీ, ఇద్దరు కూతుర్లున్నారు.

 

Tags:    

Similar News