కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు.. నాలుక కోసుకున్న యువకుడు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తిని నియంత్రించాలంటే.. భౌతిక దూరం పాటించాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ముఖానికి మాస్కులు ధరించాలి. ఇవే కదా డాక్టర్లు చెబుతున్న సూచనలు. అయితే కరోనా వ్యాప్తి చెందడానికి అసలు కారణం.. కరోనా బాధితుడి నోటి నుంచి వచ్చే తుంపర్లు. ఆ తుంపర్లనే అడ్డుకుంటే.. కరోనా రాదు కదా అని అనుకున్నాడు ఓ యువకుడు. అందుకోసం మరో ఆలోచన లేకుండా తన నాలుకనే కట్ చేసుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా నడేశ్వరి […]

Update: 2020-04-19 06:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తిని నియంత్రించాలంటే.. భౌతిక దూరం పాటించాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ముఖానికి మాస్కులు ధరించాలి. ఇవే కదా డాక్టర్లు చెబుతున్న సూచనలు. అయితే కరోనా వ్యాప్తి చెందడానికి అసలు కారణం.. కరోనా బాధితుడి నోటి నుంచి వచ్చే తుంపర్లు. ఆ తుంపర్లనే అడ్డుకుంటే.. కరోనా రాదు కదా అని అనుకున్నాడు ఓ యువకుడు. అందుకోసం మరో ఆలోచన లేకుండా తన నాలుకనే కట్ చేసుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా నడేశ్వరి గ్రామంలో జరిగింది. నాలుక కట్ చేసుకున్న ఆ యువకుని పేరు వివేక్ శర్మ.

వివేక్ శర్మ మేస్త్రీ పని చేస్తుంటాడు. ప్రస్తుతం అక్కడ ‘భవాని మాతా’ ఆలయ మరమ్మత్తు పనులు చేస్తున్నాడు. 8 మంది కూలీలతో అక్కడే ఉంటున్నాడు. అందులో అతని సోదరుడు శివం కూడా ఒకరు. వివేక్ కొద్దిరోజులుగా మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలోని తన ఇంటికి వెళ్లాలని భావించాడు. అందుకోసం పోలీసులు పర్మిషన్ తీసుకునేందుకు ప్రయత్నించినా లాక్‌డౌన్ కారణంగా వాళ్లు కుదరదని చెప్పారు. దాంతో వివేక్ తను పని చేసే చోటే ఉండిపోయాడు. ‘వివేక్ కాళీమాతా భక్తుడు. నిత్యం ఆమెను స్మరిస్తుంటాడు. శనివారం ఉదయం మార్కెట్‌కు వెళుతున్నానని చెప్పి బయలుదేరాడు. ఎంతసేపటికీ అతను తిరిగి రాకపోవడంతో.. అతని సోదరుడు శివం వివేక్‌కు ఫోన్ చేశాడు. ఎవరో ఫోన్ లిఫ్ట్ చేసి.. అతను నాదేశ్వరీ గుడి దగ్గర నాలుక కోసుకున్నాడని చెప్పాడు’ అని వివేక్ సహచర కూలీ బ్రిజేష్ పోలీసులకు వివరించాడు. గుడి ప్రాంగణంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వివేక్ ను చూసిన పూజారి .. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) కమాండర్ కు సమాచారం అందించారు. శర్మను పక్కనే ఉన్న టౌన్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్లు అతని నాలుకను తిరిగి అతికించే పనిలో ఉన్నారు. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. వివేక్ నాలుకను నాదేశ్వరి గుడిలో బలి ఇవ్వడం ద్వారా దేవత కరోనా వ్యాప్తి అడ్డుకుంటుందని నమ్మాడు.

tags :coronavirus, lockdown, mp, tongue cut off

Tags:    

Similar News