బైక్ ఆపారు… పీక కోసుకున్నాడు
పోలీసులు బైక్ ఆపారని తీవ్ర ఆవేదన చెందిన ఓ వ్యక్తి తన గొంతును బ్లేడుతో కోసుకున్నాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో చోటుచేసుకుంది. సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన లోవరాజు తన బైక్‌పై వెళ్తుండగా జగ్గంపేటలో పోలీసులు ఆపారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నందునా ఎక్కడికి వెళ్లకూడదని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన లోవరాజు వెంటనే బ్లేడుతో తన పీక కోసుకున్నాడు. పోలీసులు హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాధితుడు అపస్మారక స్థితిలోకి […]
పోలీసులు బైక్ ఆపారని తీవ్ర ఆవేదన చెందిన ఓ వ్యక్తి తన గొంతును బ్లేడుతో కోసుకున్నాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో చోటుచేసుకుంది. సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన లోవరాజు తన బైక్‌పై వెళ్తుండగా జగ్గంపేటలో పోలీసులు ఆపారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నందునా ఎక్కడికి వెళ్లకూడదని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన లోవరాజు వెంటనే బ్లేడుతో తన పీక కోసుకున్నాడు. పోలీసులు హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Tags: man, bike, police, lockdown, suicide attempt