ఆకాశంలో.. ఫ్లైయింగ్ బెడ్‌రూమ్
దిశ, వెబ్‌డెస్క్ : ‘జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ది’ అనడంలో నిజం లేకపోలేదు. ఎందుకంటే కొందరికీ మూస ధోరణిలో వెళ్లడం నచ్చదు. అందుకే ఆ పాత్‌ను బ్రేక్ చేసి కొత్తదారిలో వెళ్తుంటారు. మరికొందరు తాము రొటీన్‌గా చేసే పనుల్లోనే.. కాస్త అడ్వెంచర్ యాడ్ చేస్తుంటారు. టర్కీకి చెందిన 29 ఏళ్ల హసన్ కావల్ కూడా అదే చేశాడు. అతడు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. అతను గాల్లో తేలిపోతుంటే.. అంతా నోరెళ్లబెట్టారు. ఆకాశంలో చక్కర్లు కొడుతూ.. విమానం […]
దిశ, వెబ్‌డెస్క్ : ‘జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ది’ అనడంలో నిజం లేకపోలేదు. ఎందుకంటే కొందరికీ మూస ధోరణిలో వెళ్లడం నచ్చదు. అందుకే ఆ పాత్‌ను బ్రేక్ చేసి కొత్తదారిలో వెళ్తుంటారు. మరికొందరు తాము రొటీన్‌గా చేసే పనుల్లోనే.. కాస్త అడ్వెంచర్ యాడ్ చేస్తుంటారు. టర్కీకి చెందిన 29 ఏళ్ల హసన్ కావల్ కూడా అదే చేశాడు. అతడు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. అతను గాల్లో తేలిపోతుంటే.. అంతా నోరెళ్లబెట్టారు.
ఆకాశంలో చక్కర్లు కొడుతూ.. విమానం మాదిరి గాల్లో ఎగిరిపోయే పారాగ్లైడింగ్‌ను ఎంతోమంది సాహసవంతులు ఇష్టపడుతుంటారు. ఇటీవలే రామగుండానికి చెందిన అర్జున్ అనే వ్యక్తి పారాగ్లైడింగ్ మీద ఇష్టంతో.. తానే స్వయంగా పవర్ పారా గ్లైడర్ రూపొందించి అందులో విహరించాడు. దాదాపు 20 నిమిషాల పాటు గాల్లో విన్యాసాలు చేసి చూపరులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అర్జున్ తానే స్వయంగా పారా గ్లైడర్ రూపొందిస్తే.. హసన్ కావల్ మాత్రం పారాగ్లైడర్‌కు ఓ బెడ్‌ను అమర్చి, దాంట్లో పడుకుని ఆకాశంలో విహరిస్తూ ఓ కొత్త సాహసానికి తెరతీశాడు. కళ్లకు స్లీప్ మాస్క్ పెట్టుకుని హ్యాపీగా, రిలాక్స్‌గా నిద్రపోయాడు. ఆ ఫ్లయింగ్ బెడ్ అలా సముద్రంపై ప్రయాణించి ఓ బీచ్‌లో ల్యాండ్ అయ్యింది. ఆ బెడ్ పక్కన బెడ్‌లైట్, టీవీ.. ఇలా మొత్తం బెడ్‌రూప్ సెటప్‌ను సమకూర్చుకున్నాడు. అయితే హసన్‌కు ఇలాంటి సాహసాలు చేయడం కొత్తేం కాదు. జులైలోనూ.. పారాగ్లైడర్‌కు సోఫాతో పాటు టీవీనీ అటాచ్ చేసి పారాగ్లైడింగ్ చేశాడు. అలా గాల్లో విహరించేటప్పుడు టామ్ అండ్ జెర్రీ షో కూడా చూశాడు. స్నాక్స్ తింటూ సోడా కూడా తాగాడు. గతంలో ఆ ఫీట్‌ను ఓ ప్రమోషన్ కోసం చేయగా.. తాజాగా చేసిన ఫీట్ కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. హసన్ ఈ ఫీట్‌ను వీడియో తీశాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.