యువత టార్గెట్‌గా గంజాయి.. వ్యక్తి అరెస్ట్
దిశ, ఎల్బీనగర్ : యువతను టార్గెట్ చేస్తూ గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పురుషోత్తం రెడ్డి, సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ సత్యనారాయణ, డిటెక్టీవ్ ఇన్స్‌స్పెక్టర్ జీ.జగన్నాథ్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్‌రాయ్ (34) బతుకుతెరువు కోసం నగరానికి వలస వచ్చి అబ్ధుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని ఇంజాపూర్ గ్రామంలో కుటుంబంతో కలిసి నివాసం […]
దిశ, ఎల్బీనగర్ : యువతను టార్గెట్ చేస్తూ గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పురుషోత్తం రెడ్డి, సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ సత్యనారాయణ, డిటెక్టీవ్ ఇన్స్‌స్పెక్టర్ జీ.జగన్నాథ్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు.
బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్‌రాయ్ (34) బతుకుతెరువు కోసం నగరానికి వలస వచ్చి అబ్ధుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని ఇంజాపూర్ గ్రామంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. గత కొంత కాలంగా తుర్కయంజాల్‌లోని మస్కతీ డైరీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన నిందితుడికి డ్రైవింగ్ ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో తుర్కయాంజాల్‌లోని ఓ టీ-స్టాల్ వద్ద పరిచయమైన గుర్తు తెలియని వ్యక్తి ద్వారా గంజాయి ప్యాకెట్లను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతని వద్ద నుంచి తక్కువ ధరకు గంజాయి ప్యాకెట్లను కొనుగోలు చేశాడు.
యువతను టార్గెట్ చేసి ఒక్కొక్క ప్యాకెట్ రూ. 150కు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.10వేల విలువగల 75 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న ఏఎస్ఐ శ్రీనివాస్‌గౌడ్, కానిస్టేబుల్ కే. బాబుచారి, జీ. బాలరాజు, ఏ. కృష్ణ, ఎం. లలిత్‌కిరణ్, జి. ఉపేందర్, బి. జగన్, యూనుస్, ఎ.సుభాష్ చంద్రబోస్‌లను ఏసీపీ పురుషోత్తంరెడ్డి అభినందించారు.