మంత్రి కార్యాలయం పేరిట వసూళ్లు !

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నానంటూ డబ్బు వసూళ్ళకు పాల్పడుతున్న వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. డిపార్ట్మెంట్‌లో కొంతమందిని పర్మినెంట్ చేయబోతున్నారు. అందులో మిమ్ములను కూడా పర్మినెంట్ చేయిస్తానంటూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కునమల్ల శ్రీనివాసరావు ఆ శాఖలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫోన్లు చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా ఈ తరహా ఫోన్లు మహిళా ఉద్యోగులకే అధికంగా చేస్తూ.. అందుకు కొంత ఖర్చవుతోందని నమ్మిస్తున్నాడు. ఈ […]

Update: 2020-10-27 10:42 GMT

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నానంటూ డబ్బు వసూళ్ళకు పాల్పడుతున్న వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. డిపార్ట్మెంట్‌లో కొంతమందిని పర్మినెంట్ చేయబోతున్నారు. అందులో మిమ్ములను కూడా పర్మినెంట్ చేయిస్తానంటూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కునమల్ల శ్రీనివాసరావు ఆ శాఖలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫోన్లు చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా ఈ తరహా ఫోన్లు మహిళా ఉద్యోగులకే అధికంగా చేస్తూ.. అందుకు కొంత ఖర్చవుతోందని నమ్మిస్తున్నాడు. ఈ విషయం మంత్రి ఈటెల రాజేందర్ వద్దకు చేరడంతో అతనిపై ఫిర్యాదు చేయాలని పీఎస్‌ను ఆదేశించారు. దీంతో సీసీఎస్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితుడు శ్రీనివాస్‌రావును పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు రిమాండ్ చేశారు.

Tags:    

Similar News