క్రైమ్ లో వేరే లెవెల్: సులువైందే కాదు సుఖమిచ్చేది కూడా..
దిశ, వెబ్‌డెస్క్: నేరాలు చాలా రకాలు.. కొంతమంది దొంగతనాలు చేస్తూ నేరాలు చేస్తారు. మరికొంతమంది హత్యలు చేస్తారు. ఇంకొంతమంది దారి దోపిడీలు, ఇక ఇప్పుడు సైబర్ నేరాలు.. నేరాలు చేసైనా సులువుగా డబ్బులు సంపాదించడం ప్రస్తుతం ఫ్యాషన్ గా నడుస్తుంది. తాజాగా ఓ వ్యక్తి డబ్బులు సంపాదించడం కోసం ఒక సులువైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇక అది సులువైన మార్గమే కాదు సుఖాన్నిచ్చే మార్గం కూడా కావడంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇతగాడికి […]
దిశ, వెబ్‌డెస్క్: నేరాలు చాలా రకాలు.. కొంతమంది దొంగతనాలు చేస్తూ నేరాలు చేస్తారు. మరికొంతమంది హత్యలు చేస్తారు. ఇంకొంతమంది దారి దోపిడీలు, ఇక ఇప్పుడు సైబర్ నేరాలు.. నేరాలు చేసైనా సులువుగా డబ్బులు సంపాదించడం ప్రస్తుతం ఫ్యాషన్ గా నడుస్తుంది. తాజాగా ఓ వ్యక్తి డబ్బులు సంపాదించడం కోసం ఒక సులువైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇక అది సులువైన మార్గమే కాదు సుఖాన్నిచ్చే మార్గం కూడా కావడంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇతగాడికి వివాహిత మహిళలే టార్గెట్. ఇక భర్త లేకపోతే మరీ హ్యాపీ.. కానీ, ఏ నేరం ఎక్కువ రోజులు దాగదు కాబట్టి ఎట్టకేలకు సదురు నిందితుడు పోలీసులకు చిక్కి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.
వివరాలలోకి వెళితే.. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన రంగస్వామి మూడు దశాబ్దాల క్రితమే హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయాడు. ఇక ఇక్కడికి వచ్చాకా ఎలాగైనా తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం ఏ పని చేయాలా అని ఆలోచించి.. మహిళలను టార్గెట్ చేసి వారివద్ద నుంచి డబ్బు, నగలను దోచుకోవాలనుకున్నాడు. ఒంటరిగా ఉన్న మహిళలను వెతికి, వారి వెంట పడి మాయమాటలతో నమ్మబలికి వారిని లొంగదీసుకుంటాడు. ఆ తరువాత వారి నుంచి అందినంత దోచుకొని పరారవుతాడు. ఇలా రెండు, మూడు సార్లు చేసి దొరకకపోయేసరికి ఇక ఇదే ప్రధాన వృత్తిగా మార్చుకున్నాడు.
ఇక రోజూ ఒంటరిగా ఉన్న మహిళలను వెతకడం, వారి వెంట పడడం, కొన్ని రోజులు ఎంజాయ్ చేయడం, ఆ తరువాత దొరికినంత దోచుకొని ఉడాయించడం. ఇలా రంగస్వామి ఇప్పటివరకు 21 మంది మహిళలను మోసం చేసాడు. ఏ ఒక్కరు అతడిపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకపోవడం గమనార్హం. ఇక అందరు మహిళలు అలా ఉండరు కదా.. తాజాగా ఒక మహిళా తనను ఓ వ్యక్తి మోసం చేసి డబ్బులు, నగలు ఎత్తుకెళ్లిపోయాడని ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు అతడిని సోమవారం అరెస్ట్ చేశారు.