సీఎం ఓఎస్డీ పీఏనంటూ టోకరా.. గ్యాంగ్ అరెస్ట్

దిశ, క్రైమ్ బ్యూరో : తెలంగాణ సెక్రటేరియట్ ఎంట్రీ కార్డు, సీఎం ఓఎస్డీ పీఏ పేరుతో గుర్తింపు కార్డు, నాలుగు పోలీస్ ఐడీ కార్డులు నకిలీవి క్రియేట్ చేసి ఓ గ్యాంగ్ అమాయకుల నుంచి వసూళ్లకు పాల్పడుతోంది. ప్రభుత్వ అధికారులుగా నమ్మిస్తూ డబ్బులు లాగుతున్నారు. ప్రభుత్వ పథకాలను ఇప్పిస్తామంటూ కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్న ఓ గ్యాంగ్‌ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరి నుంచి నకిలీ గుర్తింపు కార్డులతో పాటు ఓ […]

Update: 2021-03-30 14:00 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : తెలంగాణ సెక్రటేరియట్ ఎంట్రీ కార్డు, సీఎం ఓఎస్డీ పీఏ పేరుతో గుర్తింపు కార్డు, నాలుగు పోలీస్ ఐడీ కార్డులు నకిలీవి క్రియేట్ చేసి ఓ గ్యాంగ్ అమాయకుల నుంచి వసూళ్లకు పాల్పడుతోంది. ప్రభుత్వ అధికారులుగా నమ్మిస్తూ డబ్బులు లాగుతున్నారు. ప్రభుత్వ పథకాలను ఇప్పిస్తామంటూ కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్న ఓ గ్యాంగ్‌ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరి నుంచి నకిలీ గుర్తింపు కార్డులతో పాటు ఓ బొమ్మ తుపాకీ, భారీ ఎత్తున నగదు, ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ పథకాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు 100 మంది నుంచి రూ.3 కోట్లకుపైగా వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం సీఎం క్యాంపు ఆఫీస్ ప్రగతి భవన్ వద్ద ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఓ నిరుద్యోగి నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారు. బాధితుడు పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. అప్రమత్తమైన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అమాయక ప్రజలను మోసం చేస్తున్న సుధాకర్‌తో పాటు మరో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ వివరాలను వెల్లడించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన అవుశోడపు సుధాకర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన సుధాకర్ 2004లో టూరిజం శాఖలో డ్రైవర్‌గా చేరాడు. ఆ తర్వాత 2010 వరకూ సెక్రటేరియట్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో పని చేశాడు. 5వ తరగతి వరకూ మాత్రమే చదువుకున్న సుధాకర్.. అధికారుల జీవన విధానం, వారి స్థితిగతులను గమనించాడు. తాను కూడా ప్రభుత్వ అధికారిగా నటిస్తూ విలాసవంతమైన జీవితాన్ని కొనసాగించాలని ప్రణాళికను రూపొందించాడు. అమాయకులను మోసం చేయాలని భావించాడు. దీంతో సీఎం ఎఎస్డీ పీఏగా అధికారిక ఐడీ కార్డులను తయారు చేసుకున్నాడు. తనకు సెక్యూరిటీ గార్డులుగా నాగరాజు, భీమయ్య అనే ఇద్దరు వ్యక్తులను నియామకం చేసుకున్నాడు. ప్రభుత్వం తనకు కల్పించిన వ్యక్తిగత భద్రతను కల్పించినట్టుగా చెప్పుకుంటూ ఫార్చునర్ (హై మోడల్) కార్లలో తిరుగుతూ.. ఒరిజినల్ గన్‌లా అమాయక ప్రజల వద్ద బొమ్మ పిస్టల్‌ను ప్రదర్శించేవాడు.

సీఎం ఓఎస్డీ పీఏగా చెప్పుకోవడంతో ప్రభుత్వ పథకాలు డబుల్ బెడ్ రూమ్, ప్రభుత్వ ఉద్యోగాలు, యువతకు రుణాలు, ప్రభుత్వ భూములు కేటాయించడం, బంగారాన్ని తక్కువ ధరకు ఇప్పిస్తానని చెప్పడం, పోలీస్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయక ప్రజలను నమ్మిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాధితులు తనపై నిఘా పెట్టకుండా ఉండేందుకు తరుచూ తానుండే ప్రదేశాలతో పాటు సిమ్ కార్డులను మారుస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మహాంకాళి, ఎస్సార్ నగర్, రాంగోపాల్ పేట్, పంజాగుట్ట, ఉస్మానియా యూనివర్శిటీ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేపీహెచ్‌బీ పీఎస్ లో రెండు కేసులు, రాచకొండ పీఎస్ పరిధిలోని మేడిపల్లి పీఎస్ లో కేసులు నమోదయ్యాయి. ఇంకా మరికొందరు బాధితులను గుర్తించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. సుమారు 100 మంది అమాయక ప్రజల నుంచి దాదాపు రూ.3 కోట్లకు పైగా వసూలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా రూ.1 కోటి రూపాయల నగదు, రూ.1.03 కోట్ల విలువైన హైజ్ ప్రాపర్టీ, రూ.14 లక్షల విలువైన ఫార్చనర్ కారు, తెలంగాణ సెక్రటేరియట్ పేరుతో పీఏ టు సీఎం ఓఎస్డీ గుర్తింపు కార్డు (మూడు ప్రింటులు), నాలుగు ఫేక్ పోలీస్ ఐడీ కార్డులు, ఫేక్ ఓటరు కార్డులు, మూడు ఫేక్ సెక్రటేరియట్ ఎంట్రీ కార్డు, బొమ్మ పిస్టల్, రూ.3 లక్షల విలువైన 14 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News