హస్తినకు మమతా.. అందుకేనా..!
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించేందుకు సిద్దమయ్యారు. ఈ నెల నవంబర్ 22 నుంచి 25 వరకు ఆమె ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మమతా ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకా? బీజేపీని నిలదీయడానికా? ఇలా అనేక ప్రశ్నలు ప్రజల మనసుల్లో మెదిలాడుతున్నాయి. అయితే కాంగ్రెస్‌తో భేటీ అయ్యేందుకు మమతా హస్తినకు ప్రయాణం అవుతున్నారని కొన్ని వర్గాల వారు అంటున్నారు. అదే సమయంలో బీజేపీ ఇటీవల పెంచిన […]
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించేందుకు సిద్దమయ్యారు. ఈ నెల నవంబర్ 22 నుంచి 25 వరకు ఆమె ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మమతా ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకా? బీజేపీని నిలదీయడానికా? ఇలా అనేక ప్రశ్నలు ప్రజల మనసుల్లో మెదిలాడుతున్నాయి. అయితే కాంగ్రెస్‌తో భేటీ అయ్యేందుకు మమతా హస్తినకు ప్రయాణం అవుతున్నారని కొన్ని వర్గాల వారు అంటున్నారు. అదే సమయంలో బీజేపీ ఇటీవల పెంచిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) పరిధి విషయంలో మాట్లాడేందుకని కొందరు విశ్వసిస్తున్నారు.
అయితే ఇటీవల అస్సాం, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల సరిహద్దుల నుంచి దాదాపు 50 కిలోమీటర్ల మేరా బీఎస్ఎస్ పరిధిని బీజేపీ పెంచింది. దీంతో పంజాబ్, బెంగాల్ రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటిలో పంజాబ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా బీజేపీ కావాలనే ఇలా చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు రానున్న ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు మమతా కాంగ్రెస్‌తో భేటీ కానుందని, బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలతో చేతులు కపిలేందుకు వెళుతోందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.