మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననంటున్న దీదీ

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ప్రచారం సందర్భంగా ఇరు పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుడటంతో దీని పై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలాని అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య మంత్రులతో ప్రధాని ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విపరీతంగా విజృంభిస్తుడడంతో దీనిని […]

Update: 2021-03-17 01:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ప్రచారం సందర్భంగా ఇరు పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుడటంతో దీని పై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలాని అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య మంత్రులతో ప్రధాని ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విపరీతంగా విజృంభిస్తుడడంతో దీనిని అదుపులో పెట్టెందుకు కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరవడం లేదని త‌ృణముల్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమె ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నదునా ఆమె స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానికి హాజరుకానున్నారని సమాచారం.

Tags:    

Similar News