కిరాతక హత్యలు, వేధింపులపై అమిత్ షా సైలెంట్.. ఎందుకు..?
కోల్‌కతా: బెంగాల్‌లో బీజేపీ వర్కర్ తల్లి మరణంపై కలత చెందుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై వేధింపులు, కిరాతక హత్యలపై ఎందుకు మౌనం దాల్చారని సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. తాను హింసను సమర్థించబోరని, మహిళలపై దారుణాలను ఎట్టిపరిస్థితుల్లో క్షమించబోరని వివరించారు. ఆ బీజేపీ వర్కర్ మాతృమూర్తి ఎలా మరణించారో తనకు తెలియదని అన్నారు. కానీ, ఆమె మరణంపై అమిత్ షా మొసలి కన్నీరు కారుస్తున్నారని, ట్వీట్లు చేస్తున్నారని తెలిపారు. బెంగాల్‌లో పరిస్థితులు […]
కోల్‌కతా: బెంగాల్‌లో బీజేపీ వర్కర్ తల్లి మరణంపై కలత చెందుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై వేధింపులు, కిరాతక హత్యలపై ఎందుకు మౌనం దాల్చారని సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. తాను హింసను సమర్థించబోరని, మహిళలపై దారుణాలను ఎట్టిపరిస్థితుల్లో క్షమించబోరని వివరించారు. ఆ బీజేపీ వర్కర్ మాతృమూర్తి ఎలా మరణించారో తనకు తెలియదని అన్నారు. కానీ, ఆమె మరణంపై అమిత్ షా మొసలి కన్నీరు కారుస్తున్నారని, ట్వీట్లు చేస్తున్నారని తెలిపారు. బెంగాల్‌లో పరిస్థితులు ఎంతటి దుస్థితికి చేరాయని బాధపడుతున్నారని, మరి అదే బీజేపీ పాలిత యూపీలో దారుణాలు జరిగినప్పుడు ఏం చేశారని ఎదురుదాడి చేశారు. ప్రస్తుతం రాష్ట్ర శాంతి భద్రతలు ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నాయని, ఇటీవలి రోజుల్లోనే ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల హత్యలు జరిగాయని వాపోయారు.