మోడీపై సమర శంఖం పూరించిన దీదీ.. ఇక సమరమే..?
దిశ, వెబ్‌డెస్క్: మోడీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమర శంఖం పూరించారు. మోడీకి వ్యతిరేకంగా కూటమిని సిద్దం చేసేందుకు వివిధ పార్టీల ముఖ్య నేతలను కలుస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని తన నివాసంలో దీదీ కలసి భేటీ అయ్యారు. మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని భావిస్తున్న దీదీ, ఆయా పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. సోనియాతో భేటీ అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ […]
దిశ, వెబ్‌డెస్క్: మోడీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమర శంఖం పూరించారు. మోడీకి వ్యతిరేకంగా కూటమిని సిద్దం చేసేందుకు వివిధ పార్టీల ముఖ్య నేతలను కలుస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని తన నివాసంలో దీదీ కలసి భేటీ అయ్యారు. మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని భావిస్తున్న దీదీ, ఆయా పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. సోనియాతో భేటీ అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను మమతా కలువనున్నారు.
ఢిల్లీలో ఉన్న మమతా బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు జట్టు కట్టాలని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమికి మీరు నాయకత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు స్పందించిన దీదీ.. తనకు జ్యోతిష్యం తెలియదని, ఎవరు నాయకత్వం వహించాలన్న దానిపై పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుందని చెప్పారు. 2024 ఎన్నికలు వస్తే అది మోడీకి దేశానికి మధ్య జరుగుతాయని చెప్పారు. విపక్ష పార్టీలు ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు.