పీఎం వీసా రద్దు చేయాలి: మమతా బెనర్జీ
కోల్‌కతా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఆయన వీసాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ‘బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతుండగా ఆయన బంగ్లాదేశ్ వెళ్లి బెంగాల్‌పైనే లెక్చర్లు ఇస్తున్నారు. ఇది కచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే. 2019 ఎన్నికల్లో బంగ్లాదేశ్ యాక్టర్ ఇక్కడ ప్రసంగిస్తే ఆ దేశంతో బీజేపీ మాట్లాడి ఆయన […]
కోల్‌కతా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఆయన వీసాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ‘బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతుండగా ఆయన బంగ్లాదేశ్ వెళ్లి బెంగాల్‌పైనే లెక్చర్లు ఇస్తున్నారు. ఇది కచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే. 2019 ఎన్నికల్లో బంగ్లాదేశ్ యాక్టర్ ఇక్కడ ప్రసంగిస్తే ఆ దేశంతో బీజేపీ మాట్లాడి ఆయన వీసాను రద్దు చేయించింది. మరి మోడీ వీసాను ఎందుకు రద్దు చేయకూడదు? మేం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం’ అని అన్నారు. బెంగాల్‌లో ప్రాబల్యంగల హిందు మతువా కమ్యూనిటీ ఆరాధ్య గురువు గురు హరిచంద్ ఠాకూర్ జన్మస్థలం బంగ్లాదేశ్‌లోని ఒకరాకుండి దేవాలయంలో మోడీ ప్రార్థనలను దీదీ ప్రస్తావించారు.