చెంచాగిరి చేయాల్సిన అవసరం లేదు: మల్లు రవి
దిశ, వెబ్‌డెస్క్: టీ పీసీసీ చీఫ్ విషయంలో తనపై, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌పై సీనియర్ నేత వీహెచ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత మల్లు రవి ఖండించారు. వైద్య విద్యలో ఉన్నత చదువులు చదివి సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని, తనకు ఎవరికీ చెంచాగిరీ చేయాల్సిన అవసరం లేదన్నారు. క్షమశిక్షణ గల నేతలు అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టబడి ఉండాలని స్పష్టం చేశారు. తమ ప్రాంతానికి చెందిన రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇవ్వాలని బహిరంగంగానే […]
దిశ, వెబ్‌డెస్క్: టీ పీసీసీ చీఫ్ విషయంలో తనపై, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌పై సీనియర్ నేత వీహెచ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత మల్లు రవి ఖండించారు. వైద్య విద్యలో ఉన్నత చదువులు చదివి సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని, తనకు ఎవరికీ చెంచాగిరీ చేయాల్సిన అవసరం లేదన్నారు. క్షమశిక్షణ గల నేతలు అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టబడి ఉండాలని స్పష్టం చేశారు. తమ ప్రాంతానికి చెందిన రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇవ్వాలని బహిరంగంగానే చెప్పినట్లు మల్లు రవి తెలిపారు. 165మంది నేతల అభిప్రాయాలను హైకమాండ్ తీసుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్నిస్థాయి నేతలతో మాణిక్యం ఠాగూర్ చర్చలు జరిపారని పేర్కొన్నారు. గతంలో సీఎం, సీఎల్పీ, పీసీసీ నియామకాల్లో అందరూ హైకమాండ్ నిర్ణయాలకు కట్టుబడి పని చేశారన్నారు. శనివారం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.