‘గులాబీ’ల గొప్పలు..ప్రజల తిప్పలు

దిశ, న్యూస్ బ్యూరో : కాంగ్రెస్ హయాంలో చేయలేనివి తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిందని చెప్పుకుంటున్నఅధికార పార్టీ నేతలపై సీఎల్పీనేత భట్టి విక్రమార్క తనదైన శైలిలో విరుచుకపడ్డాడు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వ తీరును ఎండగట్టాడు. రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు దేశంలో ఎక్కడా అందుబాటులో లేవని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, పూర్తి స్థాయిలో ఏ మేరకు అవి విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయో చూపించాలని కోరారు. బడ్జెట్‌లో బీసీ ఉపకార వేతనాల్లో రూ.360కోట్లు, ఎస్టీ […]

Update: 2020-03-12 07:26 GMT

దిశ, న్యూస్ బ్యూరో :
కాంగ్రెస్ హయాంలో చేయలేనివి తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిందని చెప్పుకుంటున్నఅధికార పార్టీ నేతలపై సీఎల్పీనేత భట్టి విక్రమార్క తనదైన శైలిలో విరుచుకపడ్డాడు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వ తీరును ఎండగట్టాడు. రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు దేశంలో ఎక్కడా అందుబాటులో లేవని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, పూర్తి స్థాయిలో ఏ మేరకు అవి విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయో చూపించాలని కోరారు. బడ్జెట్‌లో బీసీ ఉపకార వేతనాల్లో రూ.360కోట్లు, ఎస్టీ ఉపకార వేతనాల్లో రూ. 100కోట్ల కోత విధించారన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి గురుకులాల్లో చదువు చెప్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతుందని, కానీ రాష్ట్రంలో 58,71,080 మంది విద్యార్థులు ఉంటే కేవలం 4లక్షల మందికి మాత్రమే గురుకులాల్లో అవకాశం కల్పించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.4లక్షల మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తే రాష్ట్రం మొత్తం చెప్పించినట్టేనా మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కాళ్లేశ్వరం తామే కట్టామని గొప్పలు చెప్పుకోవడం తప్ప, కొత్తగా తవ్విన కాలువలు ఏమీ లేవని కాంగ్రెస్ హయాంలో తవ్విన వాటికే మెరుగులు దిద్దారన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ, కడెం, మిడ్ మానేరు నిర్మాణాలు చేసిందని గుర్తుచేశారు.విద్యుత్ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చామని చెబుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా చేసిందో రుజువులు చూపించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ తయారీ కోసం యాదాద్రి పవర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్, ఛత్తీస్‌గఢ్ నుంచి కొత్త లైన్ల ఏర్పాటుకు చేసుకున్న ఒప్పందాలు నేటికీ పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. రైతులకు ఇస్తానని చెప్పిన ఇన్‌పుట్ సబ్సిడీ నేటికి ఇవ్వలేదన్నారు. ఒకవేళ ఇచ్చామని మీకు అనిపిస్తే ఫ్రూవ్స్ చూపించాలన్నారు. ఇక రైతు బంధు పథకాన్నికేవలం ఎన్నికలప్పుడు మాత్రమే తెరమీదకు తీసుకొస్తూ ఓట్లు కొల్లగొడుతున్నారన్నారు. హుజుర్‌నగర్ ఉప ఎన్నిక సమయంలో కేవలం ఆ నియోజకవర్గంలో మాత్రమే రైతు బంధు వేసి మిగతా రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యేక తెలంగాణ వస్తే నిధులు, నియామకాలు వస్తాయని చెప్పిన సీఎం కేసీఆర్ తన ఇంట్లో వారికి నియామకాలు కల్పించుకున్నారని ఆయన తెలిపారు.

Tags: congress clp leader bhatti vikramarka, assembly sessions, trs govt, criticise

Tags:    

Similar News