గాంజా మత్తులో పార్టీకి హాజరైన మలైక.. వీడియో వైరల్
దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి కరిష్మా కపూర్ ఇంట్లో పార్టీకి హాజరైన ఈ బ్యూటీ.. కారు నుంచి దిగుతూ కిందపడే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ట్రోల్స్‌తో హోరెత్తిస్తున్నారు. విషయానికొస్తే, గ్రీన్ కలర్ బోల్డ్ అవుట్‌ఫిట్స్‌లో హై హీల్స్ ధరించిన మలైక.. కారులో నుంచి దిగుతూ బ్యాలెన్స్ చేయలేక కిందపడబోయింది. వెంటనే […]
దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి కరిష్మా కపూర్ ఇంట్లో పార్టీకి హాజరైన ఈ బ్యూటీ.. కారు నుంచి దిగుతూ కిందపడే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ట్రోల్స్‌తో హోరెత్తిస్తున్నారు. విషయానికొస్తే, గ్రీన్ కలర్ బోల్డ్ అవుట్‌ఫిట్స్‌లో హై హీల్స్ ధరించిన మలైక.. కారులో నుంచి దిగుతూ బ్యాలెన్స్ చేయలేక కిందపడబోయింది.
వెంటనే పక్కనున్న ఓ వ్యక్తి తనను గట్టిగా పట్టుకోవడంతో సేఫ్ అయింది. కాగా ఈ సంఘటన నుంచి తేరుకుని ఫొటోలకు పోజులిచ్చిన నటిపై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. ‘ముసలితనంలో హైహీల్స్ వేసుకుంటే అలాగే జరుగుతుంది. గాంజా తాగొచ్చినట్లున్నావ్ జాగ్రత్త’ అని విమర్శిస్తున్నారు. అంతేకాదు తన కాళ్లకు అంత చిన్న హీల్స్ ఏం సరిపోతాయి. ఓ పెద్ద స్టూల్ అయితే బాగుంటుందని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.