చలికాలం ఆ భంగిమలే పర్‌ఫెక్ట్.. హాట్ బ్యూటీ లెస్సన్స్

దిశ, సినిమా : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా ప్రస్తుతం ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ 2’ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే షోలో భాగంగా ఓ కుర్రాడు ఆమె బుగ్గలు గిల్లి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ రొమాంటిక్ సీన్‌‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేటెస్ట్ ఎపిసోడ్‌లో జడ్జి సీటులో కూర్చున్న అరోరా దగ్గరకు వచ్చిన చిన్న పిల్లలతో కాసేపు ముచ్చటించింది. ఈ క్రమంలోనే ఓ బాలుడు సడెన్‌గా మలైకా […]

Update: 2021-11-15 03:03 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా ప్రస్తుతం ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ 2’ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే షోలో భాగంగా ఓ కుర్రాడు ఆమె బుగ్గలు గిల్లి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ రొమాంటిక్ సీన్‌‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లేటెస్ట్ ఎపిసోడ్‌లో జడ్జి సీటులో కూర్చున్న అరోరా దగ్గరకు వచ్చిన చిన్న పిల్లలతో కాసేపు ముచ్చటించింది. ఈ క్రమంలోనే ఓ బాలుడు సడెన్‌గా మలైకా రెండు చెంపలు పట్టుకొని లాగడంతో షాకైంది. వెంటనే తేరుకుని ఆ చిన్నోడిని ప్రేమతో దగ్గరకు తీసుకుని హగ్ చేసుకుంది. ఈ వీడియోను మలైకా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ఫిదా అయిన స్టార్స్, నెటిజన్లు తనును ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ రోజు ఉదయం కొన్ని యోగా పిక్స్ షేర్ చేసిన నటి.. ఆ భంగిమల ప్రాధాన్యత గురించి వివరించింది. ‘అందరికీ నమస్తే! శీతాకాలం వచ్చింది. ఈ సమయంలో మనల్ని మనం వెచ్చగా ఉంచుకునేందుకు దుప్పట్లో దూరేస్తాం. అది ఓకే.. కానీ దాంతోపాటు ఉదయాన్నే లేచి యోగా చేస్తే మరింత బలంగా తయారవుతాం. ఇదిగో ఈ భంగిమ మీ తొడ కండరాలు, వెన్నుముకతో పాటు బాడీ మొత్తానికి రక్తప్రసరణ మెరుగుపరచడంలో సాయపడుతుంది’ అంటూ యోగా టిప్స్ అభిమానులతో పంచుకుంది.

బుద్ధుడి మార్గమే మేలంటున్న సోనాక్షి

Tags:    

Similar News