నిజామాబాద్ ఎంపీకు షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు ?

దిశ, బంజారాహిల్స్‌: దళితులను అవమానించేలా మాట్లాడడమే కాకుండా అట్రాసిటీ చట్టంపై చులకనగా మాట్లాడిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య బంజారాహిల్స్‌ లో ఫిర్యాదు చేశారు. గత నెల 29న అరవింద్‌ స్వయంగా ఒక ప్రెస్‌మీట్‌లో దళితులను అవమానించేలా మాట్లాడారని దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. మీ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంది కదా అని విలేకరులు ప్రశ్నిస్తే […]

Update: 2021-11-01 11:57 GMT

దిశ, బంజారాహిల్స్‌: దళితులను అవమానించేలా మాట్లాడడమే కాకుండా అట్రాసిటీ చట్టంపై చులకనగా మాట్లాడిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య బంజారాహిల్స్‌ లో ఫిర్యాదు చేశారు. గత నెల 29న అరవింద్‌ స్వయంగా ఒక ప్రెస్‌మీట్‌లో దళితులను అవమానించేలా మాట్లాడారని దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. మీ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంది కదా అని విలేకరులు ప్రశ్నిస్తే ఆ కేసు గురించి అసభ్యకరంగా మాట్లాడారన్నారు.

చట్టాలను గౌరవించాల్సిన ప్రజాప్రతినిధులు, దళితులంటే ఏ మాత్రం గౌరవం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నిజామాబాద్‌లో అరవింద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో జాతీయ కార్యదర్శి. కాశన్న, బంగి ఆనంద్‌రావు, ఎ.శ్రీనివాస్, రమేష్, బంజారాహిల్స్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. బంజారాహిల్స్‌పోలీసులు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News