‘ఇచ్చిన హామీ ప్రకారం… వెంటనే కేటాయించాలి’
దిశ, ఆందోల్: రాష్ట్రంలో, దేశంలో మాల, మాదిగలపైన జరుగుతున్న దాడులను అరికట్టాలని, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు. మాల, మాదిగల పైన ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆదివారం అందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా దళితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో డాకూరు గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఆయనకు మెమోరాండం అందజేశారు. గ్రామంలోని మాల పోచమ్మ గుడి భూమిని, కొంతమంది కబ్జా […]
దిశ, ఆందోల్: రాష్ట్రంలో, దేశంలో మాల, మాదిగలపైన జరుగుతున్న దాడులను అరికట్టాలని, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు. మాల, మాదిగల పైన ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆదివారం అందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా దళితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలో డాకూరు గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఆయనకు మెమోరాండం అందజేశారు. గ్రామంలోని మాల పోచమ్మ గుడి భూమిని, కొంతమంది కబ్జా చేశారని, వాటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం చెన్నయ్య మాట్లాడుతూ… దళితుల భూములు ప్రభుత్వాలు లాక్కోవడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు మూడెకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు.