గొర్రెపాలతో వోడ్కా..మీకు తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: మందుబాబులకు బాగా పరిచయమున్న వాటిలో ‘వోడ్కా’ కూడా ఒకటి. దీన్ని పులియబెట్టిన మిల్లెట్స్, పోటాటాస్ ఉపయోగించి తయారుచేస్తారు. ఫ్రూట్స్, షుగర్ కూడా యాడ్ చేస్తారు. ఇథనాల్ కూడా ఉంటుంది. వోడ్కాలో 40శాతానికి పైగానే ఆల్కహాల్ ఉంటుంది. అయినా..ఈ వోడ్కా తయారీ గురించి ఇప్పుడేంటీ అనుకుంటున్నారా? అయితే వోడ్కాను గొర్రె పాలతో తయారు చేస్తే? ఎలా ఉంటుంది? వినడానికే వింతగా ఉంది కదా?..ఆ వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. అనుకోకుండా ఒకరోజు.. గొర్రె […]
దిశ, వెబ్ డెస్క్: మందుబాబులకు బాగా పరిచయమున్న వాటిలో ‘వోడ్కా’ కూడా ఒకటి. దీన్ని పులియబెట్టిన మిల్లెట్స్, పోటాటాస్ ఉపయోగించి తయారుచేస్తారు. ఫ్రూట్స్, షుగర్ కూడా యాడ్ చేస్తారు. ఇథనాల్ కూడా ఉంటుంది. వోడ్కాలో 40శాతానికి పైగానే ఆల్కహాల్ ఉంటుంది. అయినా..ఈ వోడ్కా తయారీ గురించి ఇప్పుడేంటీ అనుకుంటున్నారా? అయితే వోడ్కాను గొర్రె పాలతో తయారు చేస్తే? ఎలా ఉంటుంది? వినడానికే వింతగా ఉంది కదా?..ఆ వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
అనుకోకుండా ఒకరోజు..
గొర్రె మాంసానికి, ఉన్నికి ప్రసిద్ధని, మన దేశంలో యాదవులు కులవృత్తిగా వీటిని పెంచుతారని అందరికీ తెలుసు. కానీ, టాస్మానియాకు చెందిన ర్యాన్ కూడా గొర్రెలను పాల కోసం పెంచాడు. ఎన్నో సంవత్సరాల పాటు.. ఆ పాలను ఉపయోగించి వెన్న తయారు చేసి విక్రయించాడు. అనుకోకుండా ఒక రోజు.. పాల నుంచి వోడ్కా తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ఎన్నో నిద్రలేని రాత్రులు.. ఎన్నో ప్రయోగాల అనంతర.. ర్యాన్ అనుకున్నది సాధించాడు. గొర్రె పాలతో వోడ్కా తయారు చేసి ప్రసిద్ధి పొందాడు. ప్రపంచంలోనే గొర్రె పాలతో వోడ్కా తయారు చేసిన ఏకైక వ్యక్తిగా ర్యాన్ నిలిచాడు. అంతేకాదు.. ర్యాన్ తయారు చేసిన వోడ్కా.. ప్రపంచంలోనే.. ది బెస్ట్ వోడ్కాగా అవార్డు కూడా అందుకుంది. ఇంతకీ ఎలా తయారు చేస్తాడంటే.. ముందుగా గొర్రె పాలను పితుకుతాడు. ఆ తర్వాత.. ఆ పాల నుంచి చక్కెరను వేరు చేస్తాడు. ఆ పాలను పులియబెట్టి..ఈస్ట్ కలుపుతాడు. పది రోజుల తర్వాత డిస్టిల్ చేసి, బ్లెండ్ చేసి.. వోడ్కాను తయారు చేస్తాడు. మరి ది బెస్ట్ వోడ్కాతో పాటు.. డిఫరెంట్ వోడ్కా టేస్ట్ చేయాలంటే.. టాస్మేనియా వరకు ప్రయాణం చేయాల్సిందే.. అతడు తయారు చేసిన వోడ్కాను .. ఓ బాటిల్‌లో పోసి.. దానిపై అతడే స్వయంగా ‘షీప్ హే వోడ్కా.. టాస్మానియా’అని రాశాడు.