చనిపోయిన వారి అవశేషాలతో ఆ మహిళ చేసిన పని చూస్తే..

దిశ, వెబ్‌డెస్క్ : మనకు ఇష్టమైన వారు చనిపోతే వారి జ్ఞాపకాలు మనల్ని ఎప్పుడూ వేధిస్తూ ఉంటాయి. ఇక వారి జ్ఞాపకంగా వారి వస్తువులు ఏవైనా మన దగ్గర ఉంటే బాగుండూ అని చాలా మంది అనుకుంటారు. అయితే అలా చనిపోయిన వారి దంతాలు, జుట్టు, బూడిదతో నగలు తయారు చేస్తుంది ఓ మహిళ. చనిపోయిన మన వారిని ఎప్పుడూ మనతోనే ఉన్నారని మనం గుర్తుంచుకునేలా వీలు కల్పిస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన జాక్వి విలియమ్స్ (29) అనే […]

Update: 2021-07-16 02:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మనకు ఇష్టమైన వారు చనిపోతే వారి జ్ఞాపకాలు మనల్ని ఎప్పుడూ వేధిస్తూ ఉంటాయి. ఇక వారి జ్ఞాపకంగా వారి వస్తువులు ఏవైనా మన దగ్గర ఉంటే బాగుండూ అని చాలా మంది అనుకుంటారు. అయితే అలా చనిపోయిన వారి దంతాలు, జుట్టు, బూడిదతో నగలు తయారు చేస్తుంది ఓ మహిళ. చనిపోయిన మన వారిని ఎప్పుడూ మనతోనే ఉన్నారని మనం గుర్తుంచుకునేలా వీలు కల్పిస్తుంది.

ఆస్ట్రేలియాకు చెందిన జాక్వి విలియమ్స్ (29) అనే మహిళ 2017లో జ్యువెలరీ తయారీలో డిప్లమా చేసింది. ప్రస్తుతం గ్రేవ్ మెటాలమ్ పేరుతో జ్యువెలరీ షాపు నిర్వహిస్తోంది. ఈ ఆభరణాల దుకాణానికి అక్కడ చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అక్కడ తయారయ్యే ఆభరణాలన్నీ చనిపోయిన వారి అవశేషాలను నిక్షిప్తం చేస్తూ ప్రత్యేమైన డిజైన్లలో ఆభరణాలను తయారు చేస్తారు. ఎవరైన తనకు చాలా ఇష్టమైన వారిని కోల్పోతే వారికి సంబంధించిన జుట్టు, లేదా పన్ను, బూడిదా ఏది తీసుకొచ్చినా వారం పది రోజుల్లో వాటితో జ్యూవెళ్లరీ తయారు చేసి ఇస్తుంది.

అయితే జాక్వి తన చిన్ననాటి స్నేహితురాలు చనిపోయినప్పటి నుంచి ఈ నగల తయారీ చేయడం మొదలు పెట్టిందని తెలిపింది. ఈ బిజినెస్ ద్వారా తాను ఒక్కో పీస్ తయారీకి రూ.19,500 నుంచి రూ.5.5 లక్షల వరకు వసూలు చేస్తుంది. తమ వారి అవశేషాలను ఆభరణాల రూపంలో భధ్రపరుచుకోవాలనుకున్న వారు, చనిపోయిన వారిని ఖననం చేయటానికి ముందుగానే అవశేషాలను సమీకరిస్తారు. సేకరించిన అవశేషాలను బంగారం, ప్లాటినం, వెండి, వంటి లోహాలతో కూడిన ఆభరణాల్లో నిక్షిప్తం చేస్తారు. తర్వాత వాటిని వారికి నచ్చిన విధంగా ఉంగరాలు, చైన్ లాకెట్లు, బ్రాస్ లైట్లు ఇలా వివిధ రూపాల ఆభరణాలను తమకు నచ్చినట్లు తయారు చేయించుకుంటారని తాను తెలిపింది. ఈ ఆభరణాలు తీపి గుర్తులుగా మిగిలిపోవడమే కాకుండా, ఏడుపును దిగమింగుకోవడానికి దోహద పడుతాయి అంటుంది విలియమ్స్.

Tags:    

Similar News