ఆ జాబితాలో తప్పులు లేకుండా చూసుకోండి.                    

దిశ, నాగర్‌కర్నూల్: ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూసుకోవాలని అందుకోసం సూపర్ చెక్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్నికల ఓటరు జాబితా పరిశీలకులు మాణిక్ రాజ్ కన్నన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 2022 స్పెషల్ సమ్మరి రివిజన్ ఓటరు జాబితా రూపొందించడంలో భాగంగా ఓటర్ల జాబితా ఏర్పాటుపై సూపర్ చెక్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ తో కలిసి ఈ ఆర్ ఓ లతో సమీక్ష నిర్వహించారు. ఓటరు నమోదు లేదా […]

Update: 2021-12-14 07:47 GMT

దిశ, నాగర్‌కర్నూల్: ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూసుకోవాలని అందుకోసం సూపర్ చెక్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్నికల ఓటరు జాబితా పరిశీలకులు మాణిక్ రాజ్ కన్నన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 2022 స్పెషల్ సమ్మరి రివిజన్ ఓటరు జాబితా రూపొందించడంలో భాగంగా ఓటర్ల జాబితా ఏర్పాటుపై సూపర్ చెక్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ తో కలిసి ఈ ఆర్ ఓ లతో సమీక్ష నిర్వహించారు. ఓటరు నమోదు లేదా మార్పు చేర్పులకు వచ్చిన దరఖాస్తులను గుడ్డిగా ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయరాదని ఈ ఆర్ ఓలకు సూచించారు.

వచ్చిన దరఖాస్తును బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత బిఎల్ఓ సూపర్వైజర్లు 5 శాతం సూపర్ చెక్ చేయాలన్నారు. ఒకే ఇంటి నుండి 10 కన్నా ఎక్కువ దరఖాస్తులు వస్తే ఏఈఆర్ఓ లు సూపర్ చెక్ చేయాలని వారు సరాసరి వచ్చిన దరఖాస్తులను 10 శాతం వరకు సూపర్ చెక్ చేయాల్సి ఉందన్నారు.ఈ ఆర్ ఓ లు సైతం 10 శాతం సూపర్ చెక్ చేయాల్సి ఉంటుందన్నారు. 2022 స్పెషల్ సమ్మరి రివిజన్ లో భాగంగా నవంబర్ 1, 2021 న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చిన దరఖాస్తులు, ఫిర్యాదులను డిసెంబర్ 20 వరకు పరిశీలించి పరిష్కరించేందుకు తుది గడువు ఉన్నందున రెండు మూడు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి సూపర్ చెక్ చేసి ఆన్లైన్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.

ప్రత్యేక ఓటరు క్యాంప్ పెట్టగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 20 తేదీ లోపు ఈ ఆర్ ఓ నెట్ లో అప్లోడ్ చేయవలసిందిగా ఆదేశించారు. జిల్లా ఓటర్ల జాబితాలో 1శాతం ఎక్కడైనా పెరుగుదల అయిందా అనేది చూసుకోవాలన్నారు. అదేవిధంగా నియోజక వర్గంలో 3 శాతం పెరుగుదల లేదా ఓటరు తొలగింపు లాంటివి ఉంటే వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలన్నారు. ఈఆర్ఓ లు ఎన్నికల కమిషన్ ద్వారా జారీ చేసే సర్క్యులర్‌లు ఎప్పటికప్పుడు చదువుతూ.. వాటిని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కాకపోయినప్పటికీ ఓటరు జాబితాను నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాల్సి ఉంటుందన్నారు. దీనికి అనుగుణంగా బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు, ఈ ఆర్ ఓ లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఈ ఆర్ ఓ లు, ఏఈఆర్ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News