దుమ్ములేపుతున్న ‘మేక్ ఇన్ ఇండియా’ డ్రోన్లు.. దక్షిణాసియాలోనే మొదటిసారి..!
దిశ, వెబ్‌డెస్క్ : దక్షిణాసియాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి మేకిన్ ఇండియా డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈశాన్య భారతంలోని ప్రజలకు వీటి ద్వారా అత్యవసర మెడిసిన్, కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సోమవారం తెలిపారు. ఐసీఎంఆర్ యొక్క డ్రోన్ రెస్పాన్స్ మరియు ఔట్ రీచ్ ఇన్ నార్త్ ఈస్ట్ (i-Drone) ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లను రవాణా చేయడానికి ఒక డెలివరీ మోడల్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. మణిపూర్ రాష్ట్రంలో 12-15 […]
దిశ, వెబ్‌డెస్క్ : దక్షిణాసియాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి మేకిన్ ఇండియా డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈశాన్య భారతంలోని ప్రజలకు వీటి ద్వారా అత్యవసర మెడిసిన్, కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సోమవారం తెలిపారు. ఐసీఎంఆర్ యొక్క డ్రోన్ రెస్పాన్స్ మరియు ఔట్ రీచ్ ఇన్ నార్త్ ఈస్ట్ (i-Drone) ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లను రవాణా చేయడానికి ఒక డెలివరీ మోడల్‌ను ప్రారంభించినట్టు తెలిపారు.
మణిపూర్ రాష్ట్రంలో 12-15 నిమిషాల వ్యవధిలో 15 కిలోమీటర్ల వైమానిక దూరంలోని రెండు ప్రదేశాల మధ్య COVID-19 వ్యాక్సిన్‌లను రవాణా చేయడానికి దక్షిణాసియాలోనే మొదటిసారిగా ‘మేక్ ఇన్ ఇండియా’ డ్రోన్ ఉపయోగించబడిందని కేంద్ర మంత్రి స్పష్టంచేశారు. సమీప భవిష్యత్తులో డ్రోన్ల ద్వారా మెడిసిన్ సరఫరా ప్రక్రియను దేశమంతటా విస్తరిస్తామన్నారు.