బండి సంజయ్ కి మైనంపల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలి

దిశ,తెలంగాణ బ్యూరో: బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతు రావు బహిరంగంగా క్షమాపనలు చెప్పాలని, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ఆదివారం డిమాండ్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. మైనంపల్లి ఓ రౌడీ షీటర్ అని ఆయన చేసిన ఆరాచకాలను, కబ్జా బాగోతాలను కేంద్ర విచారణ సంస్థలతో ధర్యాప్తు చేపించి అంతు చూస్తామని హెచ్చరించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ మాట్లాడుతూ జెండా ఆవిష్కరణ […]

Update: 2021-08-15 12:14 GMT

దిశ,తెలంగాణ బ్యూరో: బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతు రావు బహిరంగంగా క్షమాపనలు చెప్పాలని, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ఆదివారం డిమాండ్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. మైనంపల్లి ఓ రౌడీ షీటర్ అని ఆయన చేసిన ఆరాచకాలను, కబ్జా బాగోతాలను కేంద్ర విచారణ సంస్థలతో ధర్యాప్తు చేపించి అంతు చూస్తామని హెచ్చరించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ మాట్లాడుతూ జెండా ఆవిష్కరణ సమయంలో జాతీయ పథాకాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి అవమానించారని ఆరోపించారు. బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ ని హద్దు అదుపులేకుండా దూషించారని, బీసీలను ఇలా అవమానిస్తావని తెలియక మల్కాజిగిరి ప్రజలు ఓటు వేశారన్నారు.

కేసీఆర్ సభలో బండి సంజయ్ కి క్షమాపన చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతక ముందుకూడా జర్నలిస్టుని బెదిరించారన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో మైనంపల్లి అహంకారాన్ని పాతిపెడతాం అని హెచ్చరించారు. బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా మాట్లాడుతూ జెండా ఆవిష్కరణ జరపకుండా మైనంపల్లి మధ్యలో అడ్డుకున్నారని, అంబేడ్కర్,గాంధీ చిత్రపటాలను అవమానించారని ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధి అని మరిచిపోయి సోయిలేకుండా మాట్లాడటం సరికాదన్నారు. బండి సంజయ్ కి క్షమాపన చెప్పకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు.

 

Tags:    

Similar News