రికార్డు స్థాయిలో 'థార్' మోడల్ ధర పెంపు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటో పరిశ్రమలో వాహనాల పెంపు ధోరణి కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించగా, తాజా దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా తన కార్ల ధరలను రికార్డు స్థాయిలో పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. ధరల పెంపు 2-3 శాతం వరకు ఉన్నట్టు తెలిపింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని డీలర్ వర్గాలు చెబుతున్నాయి. వాహన తయారీలో కీలకమైన ఇన్‌పుట్ ఖర్చులు అధికమవడంతో ధరలను పెంచక తప్పడంలేదని కంపెనీ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటో పరిశ్రమలో వాహనాల పెంపు ధోరణి కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించగా, తాజా దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా తన కార్ల ధరలను రికార్డు స్థాయిలో పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. ధరల పెంపు 2-3 శాతం వరకు ఉన్నట్టు తెలిపింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని డీలర్ వర్గాలు చెబుతున్నాయి. వాహన తయారీలో కీలకమైన ఇన్‌పుట్ ఖర్చులు అధికమవడంతో ధరలను పెంచక తప్పడంలేదని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటికే రెండు సార్లు ధరలు పెంచిన మహీంద్రా ఇది మూడోసారి. అయితే, మిగిలిన మోడళ్లతో పోలిస్తే మహీంద్రా సరికొత్త థార్ మోడల్‌పై అత్యధికంగా రూ. 32 వేల నుంచి రూ. 92 వేల వరకు ధరను పెంచింది. ఇది వేరియంట్‌ని బట్టి వేరుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. థార్ మోడల్ దేశీయ మార్కెట్లో వచ్చినప్పటి నుంచి ఈ స్థాయిలో ధరను పెంచడం ఇదే తొలిసారని డీలర్లు అభిప్రాయపడ్డారు. ఇక, మిగిలిన మోడళ్ల ధరలను పరిశీలిస్తే.. మహీంద్రా బొలెరో ధరను రూ. 22,508 వరకు, స్కార్పియో రూ. 37,395, ఎక్స్‌యూవీ 300 రూ. 24,029, ఎక్స్‌యూవీ 500 రూ. 3,068, ఆల్టరస్ రూ. 3,356 వరకు పెంచింది.